ఆయన వైసీపీలో కీలకమైన నేతగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. రెండు దఫాలుగా ఆయన పదవీ కాలం కొనసాగుతూ వస్తోంది. ఇక ఆయన లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున సాహితీరంగంలో కృషి చేసిన వారికి అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమం విశాఖలో సాగుతుంది.
తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణికి సాహితీ పురస్కారం అందించారు. అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మిజోరాం గవర్నర్ గా ఉన్న డాక్టర్ కె హరిబాబు చీఫ్ గెస్ట్ గా వస్తే లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ నుంచి స్పెషల్ గా వచ్చారు.
ఇక ఇలా సైలెంట్ గా వచ్చి అలా సందడి చేశారు ప్రముఖ సినీ నటుడు డాక్టర్ ఎం మోహన్ బాబు. ఇలా చాలా మంది ప్రముఖులు అంతా ఈ కార్యక్రమాన కనిపించడం, వారి పూర్వాశ్రమాలలో వివిధ రాజకీయ పార్టీలలో పనిచేసినవారు కావడం అనుబంధాలు కలిగి ఉన్న వారు కావడంతో ఇంతమందిని ఒక చోట చేర్చిన యార్లగడ్డ ఔరా అనిపించుకున్నారు. ఆయన వైసీపీలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. అయితే సినీ నటుడు మోహన్ బాబు మాత్రం ఎందుకో మౌనంగా ఉంటున్నారు. అయినా ఆయన రావడం అంటే రాజకీయాలకు అతీతంగా యార్లగడ్డ వారి పరిచయాలు ఉంటాయనే ఒప్పుకోవాలి.
ఇక తెలుగు వారి ప్రతిభకు తెలుగులో గుర్తింపు లేదు అంటూ తనికెళ్ళ భరణి కొన్ని సంచలన కామెంట్స్ చేయడం విశేషం. తాను తీసిన షార్ట్ ఫిల్మ్ సిరాకు అంతర్జాతీయ బహుమతి వచ్చిన తరువాతనే తెలుగు వారు దాని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారని ఆయన చెప్పుకొచ్చారు.