గాజువాకకు గురి పెట్టిన వైసీపీ

విశాఖ జిల్లాలో గాజువాక ఎంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గమో అందరికీ తెలుసు. 2009లో ఏర్పాటు అయిన ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ముగ్గురు అయ్యారు.…

విశాఖ జిల్లాలో గాజువాక ఎంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గమో అందరికీ తెలుసు. 2009లో ఏర్పాటు అయిన ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ముగ్గురు అయ్యారు.

మొదటిసారి ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీ గెలిస్తే, 2019లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు. ఆయనని ఓడించి జెయింట్ కిల్లర్ గా వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సంచలనం క్రియేట్ చేశారు.

మరో పది నెలలలో ఎన్నికలు ఉండగా గాజువాక మీద వైసీపీ గురి పెడుతోంది. ఈసారి కూడా గాజువాకను సొంతం చేసుకోవాలని చూస్తోంది. గాజువాకలో గత నాలుగేళ్ళలో  సాధించిన అభివృద్ధి సంక్షేమం మీద జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని ఆద్వర్యంలో రివ్యూ చేశారు. విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి మీద వరసగా జిల్లా మంత్రి ఆద్వర్యంలో రివ్యూస్ జరుగుతాని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వీటిలో మొదటిగా గాజువాకను తీసుకోవడం విశేషం. దీన్ని బట్టి గాజువాకకు వైసీపీ రాజకీయంగా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అర్ధం అవుతోంది. పొత్తులలో భాగంగా మరోసారి గాజువాకలో పోటీకి జనసేన దిగుతుందని అంటున్నారు. ఈసారి కూడా విజయం సొంతం చేసుకోవడానికి వైసీపీ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి అధికారుల స్థాయిలో రివ్యూస్ చేసి మిగిలిన కాలంలో చేయాల్సిన పనులు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఆలోచనగా ఉంది. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్న ఈ రివ్యూ మీటింగులో గాజువాక అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు అధికారులను ఆదేశించడం విశేషం.