వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ కేసుల‌పై హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం!

కూట‌మి ప్ర‌భుత్వం చిన్న ఆరోప‌ణ‌ను కూడా స‌హించే ప‌రిస్థితి లేదు. భ‌యంతో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించి వేస్తోంద‌న్న అప్ర‌తిష్ట‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ మూట‌క‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే అనేక మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌ల‌పై కేసుల…

కూట‌మి ప్ర‌భుత్వం చిన్న ఆరోప‌ణ‌ను కూడా స‌హించే ప‌రిస్థితి లేదు. భ‌యంతో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించి వేస్తోంద‌న్న అప్ర‌తిష్ట‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ మూట‌క‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే అనేక మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌ల‌పై కేసుల న‌మోదుతో పాటు జైలుపాలు చేసిన సంగ‌తి తెలిసిందే. హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వాళ్ల‌ను జైలుకు పంప‌డాన్ని పౌర స‌మాజం స్వాగ‌తిస్తుంది. కానీ పాల‌న‌పై అభిప్రాయం చెప్ప‌డ‌మే త‌ప్పు అన్న‌ట్టుగా కేసులు పెట్టి, జైలుకు పంప‌డంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త మున‌గా హ‌రీశ్వ‌ర‌రెడ్డిపై న‌మోదైన 19 కేసుల‌కు సంబంధించి ఏపీ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా 18 కేసుల‌పై స్టే ద‌క్కిందంటే… న్యాయ స్థానం వాటిని ఎలా అర్థం చేసుకున్న‌దో ప్ర‌త్యేక చెప్పాల్సిన ప‌నిలేదు. ఏపీ పోలీసులు కేసుల న‌మోదులో నిబంధ‌న‌ల్ని పాటించ‌లేదంటూ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలాగైతే డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి వుంటుంద‌ని ధ‌ర్యాస‌నం హెచ్చ‌రించింది.

అయిన‌ప్ప‌టికీ పోలీసుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. అధికార ఒత్తిడితో కేసులు న‌మోదు చేస్తూనే ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు మార్గ‌నిర్దేశ‌కాల‌ను ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా త‌న‌పై కేసులు న‌మోదు చేయ‌డం, అలాగే యాంత్రికంగా మేజిస్ట్రేట్లు రిమాండ్‌కు ఆదేశిస్తున్నారంటూ ఏపీ హైకోర్టు రిజిస్ట‌ర్ జ‌న‌ర‌ల్‌కు ఆధారాల‌తో హ‌రీశ్వ‌ర‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఏడేళ్ల లోపు శిక్ష ప‌డే కేసుల్లో కూడా త‌గిన కార‌ణాలు చూప‌కుండా రిమాండ్‌కు ఆదేశిస్తున్నార‌ని మేజిస్ట్రేట్ల‌పై కూడా ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. లోపభూయిష్ట ఉత్త‌ర్వుల‌ను ఆధారాల‌తో త‌మ దృష్టికి తీసుకొస్తే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైకోర్టు చెప్పిన నేప‌థ్యంలో , ఫిర్యాదు చేసిన‌ట్టు అత‌ను తెలిపాడు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్వ‌ర‌రెడ్డిపై న‌మోదైన 19 ఎఫ్ఐఆర్‌ల‌లో కేవ‌లం ఒకే ఒక్క కేసు విచారించుకోవ‌చ్చ‌ని, మిగిలిన వాటిపై స్టే విధిస్తున్న‌ట్టు హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. హైకోర్టు నిర్ణ‌యం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌కి భారీ ఊర‌ట ల‌భించిన‌ట్టైంది. ఇదే సంద‌ర్భంలో పోలీసుల‌కు భారీ షాక్ త‌గిలింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

10 Replies to “వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ కేసుల‌పై హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం!”

  1. స్టే ఇచ్చారంటే న్యాయస్థానం ఎలా అర్థం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

    చంద్రబాబు గారి కేసులకు స్టే ఇస్తే మాత్రం ఏడుస్తాం..

        1. వాడొక జఫ్ఫా జగన్నాధం…బేసిక్ కనౌలెడ్జి లేదు…జగన్ కి స్టే అంటాడు. సరస్వతి సిమెంట్ కి లీజ్ అంటాడు, ప్రూఫ్ అడిగితె టాపిక్ దివెర్త్ చేసి సొళ్ళు చెప్తాడు

        2. URSA క్లస్టర్స్ కి రూపాయి కి భూమి ఇచ్చారంటాడు…జి.ఓ. పట్టుకురా అంటే …జి.ఓ. లు ఉండే వెబ్సైటు తెలియదు ఏడవకి. ఆ సైట్ కూడా ఇచ్ఛా రెండు రోజులు అయింది ,ఇంకా వేడుకుంటున్నాడు బ్లూ బకరా

Comments are closed.