శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయభేరీ మోగించింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా 776 ఓటర్లుగా ఉన్నారు. వైసీపీ తరఫున నిలబడిన నర్తు రామారావుకు 632 ఓట్లు లభించాయి. ఆయనను ఓడిస్తాను అంటూ పోటీకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆనెపు రామక్రిష్ణకు 108 ఓట్లు లభించాయి.
ఈ ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ రామక్రిష్ణ పోటీ పడడమే విశేషం అనుకుంటే ఆయనకు తెర వెనక మద్దతు తెలుగుదేశం అని ప్రచారం జరిగింది. ఇంత చేసినా వైసీపీ బంపర్ విక్టరీని ఎవరూ ఆపలేకపోయారు. ఎనభై శాతానికి పైగా ఓట్లను ఆ పార్టీ అభ్యర్ధి నర్తు రామారావు దక్కించుకున్నారు.
దాంతో ఇండిపెండెంట్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. నిజానికి ఒక మాజీ జెడ్పీటీసీకి ఇన్ని ఓట్లు అయినా ఎలా వచ్చాయి అన్న డౌట్ ఉంది. దానికి సామాజిక సమీకరణలతో పాటు తెలుగుదేశం ముసుగులో ఉండి పోరాటం చేసింది అని అంటున్నారు. దాంతో 108 ఓట్లు వచ్చాయని అంటున్నారు. నిజంగా ఏకగ్రీవం కావాల్సిన సీటుని టీడీపీ ఇండైరెక్ట్ గా వచ్చి ఎన్నికల పోరుకు తెర తీసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం తెలుగుదేశం కంచుకోట అని చెబుతారు.
అలాంటి చోట వైసీపీ గెలవడం అంటే అది అతి పెద్ద విజయంగా చెబుతున్నారు. శ్రీకాకుళంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ఇలాకాలో ఈ విజయం తమకెంతో పదిలమని వైసీపీ నేతలు అంటున్నారు. నర్తు రామారావు రాజకీయంగా మంచి అవకాశం లభించింది అని అంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాలు ఫలించాయని విశ్లేషిస్తున్నారు.