విలేకరి అయితే.. నిబంధనలేమీ ఖాతరు చేయరా?

అధికారులు చేస్తున్న పనిలోకి.. యథేచ్ఛగా చొరబడిపోయి ఫోటోలు వీడియలో తీయడానికి విలేకరికి అధికారం ఉంటుందా?

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను కబ్జా చేసేశారంటూ ఈనాడు దినపత్రిక కొన్ని రోజులుగా వార్తాకథనాలు అందిస్తోంది. అయితే ఇందులో చిన్న తేడా కూడా లేదని.. అన్నీ పక్కా భూములేనని.. తాము తప్పు చేయలేదని ఆధారాలతో సహా, పత్రాలతో సహా పెద్దిరెడ్డి బయటపెట్టారు. కానీ.. ఆ సంగతులు పట్టించుకోకుండా కథనాలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి.

వైసీపీ వారి మొర ఎవ్వరికీ పట్టలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా, వరుస కథనాలు రావడంతో.. నిజాలు తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగారు. సర్వేలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా అక్కడకు వెళ్లడం ఎవరు చేసినా తప్పే.. కానీ ఈనాడు విలేకరి వెళ్లి ఏకంగా కలెక్టరు, జిల్లా ఎస్పీలతోనే తగాదా పెట్టుకోవడం విశేషం. వారి అనుమతి లేకుండా వెళ్లి ఫోటోలు వీడియోలు తీస్తూ.. వద్దని అభ్యంతర పెట్టినందుకు జిల్లా ఉన్నతాధికారులమీదనే పితూరీలు చేయడం ఇంకా పెద్ద ట్విస్టు.

పెద్దిరెడ్డి భూ అక్రమాలు అంటూ ఆరోపణలు వచ్చిన చోట కలెక్టరు, జేసీ, ఎస్పీ కలిసి సర్వే బృందాలతో వెళ్లారు. అక్కడికి న్యూస్ టుడే విలేకరిగా గుర్తింపు ఉండే ఈనాడు విలేకరి రావడం ఫోటోలు, వీడియోలు తీయడం జరిగింది. అలా చేయవద్దంటూ కలెక్టరు అతని చేతినుంచి ఫోను తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అతనితో అసలిక్కడకు ఎందుకొచ్చావు.. ఎలా వచ్చావు.. హెల్మెట్ లేకుండా వచ్చినందుకు కేసు పెడతా అని అన్నట్టుగా ఆ పత్రికలోనే రాశారు. సదరు విలేకరి.. తమ పైవాళ్లకు చెప్పుకుని, కలెక్టరు, ఎస్పీ కంటె పెద్ద స్థాయి వారి దృష్టికి తీసుకెళ్లి సాయంత్రానికి తన ఫోను తిరిగి తీసుకున్నారు.

ఈ విలేకరి దందా ఏమిటో సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. అధికారులు చేస్తున్న పనిలోకి.. యథేచ్ఛగా చొరబడిపోయి ఫోటోలు వీడియలో తీయడానికి విలేకరికి అధికారం ఉంటుందా? ఎవ్వరి అనుమతి తీసుకునే అవసరమే లేదా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ముకాసే పత్రిక విలేకరే గనుక.. అనుమతులు తీసుకోవడం పెద్ద పని కాదు. కానీ.. తనకు అలాంటివి అవసరం లేనే లేదన్నట్టుగా అహంకారంతో వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉంది. అధికారులు సర్వే చేస్తే వారిని అడిగి వివరాలు తెలుసుకోవడానికి విలేకరికి హక్కు ఉంటుంది. చెప్పకపోతే.. సర్వే బృందాలు వెళ్లాయి గానీ.. వివరాలు చెప్పడానికి నిరాకరించారు.. అని వారి మీద అనుమానాలు పుట్టేలా రాయడానికి కూడా వీలుంటుంది.

అంతే తప్ప.. వారు పనిచేసుకుంటుండగా.. అక్కడికి వెళ్లడం అనేది అక్రమ చొరబాటు కిందికి వస్తుంది. అది నేరమే. కానీ.. కేవలం అధికార పార్టీ వారి ఒత్తిడి వల్ల, అధికార పార్టీకి కొమ్ముకాసే పత్రిక విలేకరి కావడం వల్ల.. కలెక్టరు ఎస్పీ కూడా లొంగిపోయినట్టుగా వ్యవహరించారని, ఇదే పని సాక్షి పత్రిక విలేకరి గనుక చేసి ఉంటే ఈ పాటికి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదై ఉండేవని ప్రజలు అనుకుంటున్నారు.

15 Replies to “విలేకరి అయితే.. నిబంధనలేమీ ఖాతరు చేయరా?”

  1. అయినా ఇల్లు భలే కట్టుకున్నాడు కదా..

    చీమలు దూరని చిట్టడవి.. కాకులు వెళ్లలేని కారడవి లో.. పట్టా భూములు ఎలా వచ్చాయబ్బా..

    ఏంటో.. అంతా జగన్మాయ..

    అసలు విషయం వదిలేసి.. విలేఖరి మీద ఏడుస్తావేంట్రా ముండమోపి..

    1. అది ఇల్లు కాదంటే కోష్టం అంట. తనకోసం కాదు అది కట్టింది, తోట పని చేసే తోటమాలి, కాపలాదారు కోసం అంతా…ఎంత “పెద్ద” మనసో

      1. ఓకే.. వాడి దాన గుణం.. జాలి గుణం బాగుంది..

        కానీ నట్ట అడవిలోకి.. పట్టా భూములు ఎవరిచ్చారు.. ఎలా వచ్చాయి.. అనే బేసిక్ క్వశ్చన్ కి మాత్రం సమాధానమే ఉండదు..

        ఆ ఇంటికి.. రోడ్లు ఎవరు వేశారు.. ఆ రోడ్ కోసం తీసుకున్న భూమి ఎవరిదీ..? అది కూడా పట్టా భూమేనా..?

        అందుకే.. జగన్మాయ అంటున్నది..

          1. మరి.. అది నిరూపిస్తుంటేనే కదా మీరు భయపడుతున్నారు..

            తప్పు లేకపోతే భయమెందుకు.. ?

            సాక్షి లో 2000 లోనే ఇచ్చారు అని చెప్పారు.. అది మీరు నమ్మేశారు.. ఆ నమ్మకమే కదా నిరూపించడానికి ప్రభుత్వం పని చేస్తోంది..

            చంద్రబాబు మాయ ని చంద్రబాబే వచ్చి చేధించాలన్నమాట..

            జగన్ రెడ్డి కి లాభం వస్తే.. ఇలాంటివేమీ పట్టింపులు ఉండవన్నమాట..

          2. చెయ్యండి, చెయ్యండి, ఎవరాపారు … మొన్న సరస్వతి భూముల్లో ఏదో కనుక్కున్నారో… జాగ్రత్తగా దాచారు కదా.. ఇది కూడా జాగ్రత్త చేయండి.. మళ్ళీ దాచుకోవాలి కదా.

          3. పాపం.. మీరు దోచుకున్న, దాచుకున్న లెక్కలు విజ సాయి రెడ్డే చెప్పేసుకొంటున్నాడు..

            వెళ్లి.. కుదిరితే.. వాడిని ఆపుకోండి..

  2. పర్యావరణ అనుమతి లేకుండా, అటవీ భూముల్లో

    A1 ఐటమ్ గాడు” పెళ్ళాం కోసం ఋషికొండ ప్యాలెస్” కట్టాడు..

    “పెద్దిరెడ్డి తన పాలేరు కోసం ప్యాలెస్” కట్టాడు..

    బాగా సాగింది రా మీ రాస ఎవ్వారం..

  3. ఆ ప్యాలస్ నేల సెల్లార్ లోని రహస్య గది లో వైఎ*స్ఆర్ నీ బం*ధించి వున్నారు ఆయన ఇంకా బతికే వున్నారు అని ఒక స్థానికుల అనుమానం.

    లేక

    రె*డ్ శాం*డల్ చెక్కలు దాచారు

    లేక

    సీల*వత్ని గం*జాయి దాచారు

    లేక

    అ*ప్పట్లో ప్యా*లస్ కి వచ్చి మా*యం అయిన ల*క్ష కో*ట్ల కరె*న్సీ లా*రీ నీ దా*చారు

    కనుక వైఎ*స్ఆర్ ఫ్యా*న్స్ అనేవా*ళ్ళు ఆ ప్యాలస్ లో ప్రతి ఇటు*క విడ*దీసి మరి పక్కన పెట్టీ వైఎస్ఆర్ గారికి విడి*పించి బయ*టకి తీ*సుకు రావాలి.

Comments are closed.