టోల్ ఫీజుల‌తో 55 వేల కోట్ల రూపాయ‌లు!

గ‌తంలో సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అంటూ ప్ర‌భుత్వాలు నినాదాలు ఇచ్చాయి. అయితే గత ఇర‌వై యేళ్ల‌లో ఆ నినాదం లేదు.

జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ వ‌సూళ్ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం పంట‌ప‌డిన‌ట్టుగా ఉంది. గ‌త ఏడాది కాలంలో వ‌సూలైన టోల్ ఫీజుల మొత్తం దాదాపు 55 వేల కోట్ల రూపాయ‌ల అని గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఓ మోస్త‌రు రాష్ట్రం వాస్త‌విక బ‌డ్జెట్ కు స‌మానంగా ఉంది ఈ మొత్తం. కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట వ‌ర‌కూ టోల్ ఫీజులు అనేవి చెప్పుకోద‌గిన‌వి ఏమీ కావు. అయితే ఇప్పుడు టోల్ ఫీజుల వ‌సూళ్లు ఇలా వేల కోట్ల రూపాయ‌ల స్థాయికి చేరాయి. 55 వేల కోట్ల రూపాయ‌లు అంటే.. ఇది భారీ మొత్త‌మే.

ప్ర‌స్తుతం ర‌హ‌దారుల విష‌యంలో టోల్ శ‌కం న‌డుస్తూ ఉంది. ఇప్పుడు ప‌రుస్తున్న జాతీయ ర‌హ‌దారులు అన్నీ టోల్ మీదే ఆధార‌ప‌డ్డాయి. హామ్ (హెచ్ఏఎం) ప‌ద్ధ‌తిలో ఇప్పుడు జాతీయ ర‌హ‌దారులు నిర్మితం అవుతున్నాయి దేశంలో. ఈ ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. ప్ర‌భుత్వ పెట్టుబ‌డి చాలా చాలా త‌క్కువ‌. ఉదాహ‌ర‌ణ‌కు రెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిత‌మ‌య్యే ఒక రోడ్డు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు ప‌దో వంతు సొమ్మును వెచ్చిస్తుంది. మిగ‌తా డ‌బ్బంతా కాంట్రాక్టు సంస్థ‌లే పెట్టుకుంటాయి. అవి లోన్లే తెచ్చుకుంటాయో, సొంత డ‌బ్బునే పెడ‌తాయో అన‌వ‌స‌రం. అయిన‌ప్ప‌టికీ కాంట్రాక్టు సంస్థ‌లు పోటీలు ప‌డి మ‌రీ టెండ‌ర్లు వేస్తున్నాయి. 90 శాతం డ‌బ్బును సొంతంగా పెట్టి.. అవి రోడ్ల‌ను నిర్మిస్తున్నాయి. ఇందుమూలంగా వారికి ద‌క్కేది ఏమిటంటే.. టోల్ ఫీజు!

తాము పెట్టిన పెట్టుబ‌డికి అనుగుణంగా టోల్స్ వ‌సూళు చేసుకోవ‌డానికి అవి ఒప్పందం చేసుకుంటాయి. రెండు మూడు సంవ‌త్స‌రాల్లో ఒక రోడ్డు త‌యారైందంటే.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఇర‌వై ముప్పై సంవత్స‌రాల‌కు అవి టోల్ వ‌సూలు చేసుకోవ‌చ్చు! అలా ఇప్పుడు రోడ్డు నిర్మాణానికి తాము పెట్టే పెట్టుబ‌డిని అవి తిరిగి సంపాదించుకునే మార్గం ఉంది. ఇప్పుడు స‌గ‌టున ప్ర‌తి 50 -60 కిలోమీట‌ర్ల‌కూ జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ గేట్లున్నాయి. ఒక వ్య‌క్తిగ‌త కారు హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వ‌ర‌కూ ప్ర‌యాణించాలంటే.. దాదాపు వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కూ కేవ‌లం టోల్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రెండు న‌గ‌రాల మ‌ధ్య‌న దూరం 600 కిలోమీట‌ర్లు అనుకుంటే.. టోల్ ఫీజు 900 నుంచి వెయ్యి వ‌ర‌కూ ఉంది. అదే బ‌స్సుల‌కు, లారీలకూ , ఇత‌ర క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కు వేరే ధ‌ర‌! వాటి పరిమాణాన్ని బ‌ట్టి ఇది రెట్టింపు, మూడు రెట్లు కూడా అవుతుంది. దీంతో ప్ర‌భుత్వానికి, పెట్టుబ‌డి దారీ కంపెనీల‌కూ ఇబ్బ‌డిముబ్బ‌డిగా డ‌బ్బులు వ‌స్తున్నాయి.

ఈ మ‌ధ్య‌నే కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. వాహ‌నాల‌కు టోల్ ను ఇక నుంచి కిలోమీట‌ర్ల లెక్క‌న వ‌సూలు చేయ‌నున్న‌ట్టుగా, జీపీఎస్ ద్వారా ఎన్ని కిలోమీటర్లు ప్ర‌యాణిస్తే అంత టోల్ అన్న‌ట్టుగా ఒక ప్ర‌తిపాద‌న చేసింది. అయితే దాని అమ‌లుకు ముందే.. కొత్త విధానాన్ని ప్ర‌క‌టించింది. ఇప్పుడు టోల్ ఫీజుల‌కు పాస్ ల‌ను జారీ చేయ‌బోతోంది ప్ర‌భుత్వం. ఒక కారుకు సంబంధించి ఏడాదికి మూడు వేల రూపాయ‌లు క‌డితే పాస్ ఇస్తుంది. దాని ద్వారా ఏడాదంతా ఎక్క‌డా టోల్ చెల్లించ‌కుండా తిర‌గొచ్చు. అదే 30 వేల రూపాయ‌లు క‌డితే 15 సంవ‌త్స‌రాల పాటు అది పాస్ గా ప‌ని చేస్తుంది! =

ఇలా పాస్ కొనుక్కొని ఎప్ప‌టిక‌ప్పుడు టోల్ క‌ట్టాల్సిన పని లేకుండా కొత్త ఏర్పాటును చేశారు. బహుశా జీపీఎస్ విధానం స‌క్సెస్ కాద‌నుకున్నారో ఏమో కానీ.. ఈ పాస్ ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెట్టారు. వాస్త‌వానికి వ్య‌క్తిగ‌త కార్ల వ‌ల్ల వ‌స్తున్న టోల్ ఫీజు త‌క్కువేన‌ట‌! 55 వేల కోట్ల రూపాయ‌ల టోల్ మొత్తంలో వ్య‌క్తిగ‌త కార్ల వ‌ల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి ల‌భిస్తోంద‌ట‌, దీంతో.. ఇలాంటి పాస్ విధానం పెట్టినా.. పెద్ద‌గా పోయేదేం లేద‌ని ప్ర‌భుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంద‌ట‌.

ఎలాగూ క‌మ‌ర్షియ‌ల్ వెహికల్స్, బ‌స్సులు -లారీల ద్వారానే పెద్ద మొత్తం వ‌స్తుంది కాబ‌ట్టి.. వ్య‌క్తిగ‌త కార్ల‌కు పాస్ వ‌ల్ల ప్ర‌భుత్వానికి- పెట్టుబ‌డిదారీ కంపెనీల‌కూ లాభ‌మే కానీ, న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ట‌. మొత్తానికి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ వ్య‌వ‌హారం ఒక పెద్ద వ్యాపారంగానే వ‌ర్ధిల్లుతూ ఉంది.

గ‌తంలో సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అంటూ ప్ర‌భుత్వాలు నినాదాలు ఇచ్చాయి. అయితే గత ఇర‌వై యేళ్ల‌లో ఆ నినాదం లేదు. ఎందుకంటే.. పెట్రోల్ డీజిల్ వినియోగం ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని కంపెనీల‌కు మంచి లాభ‌సాటి వ్యాపారంగా మారింది. అలాగే ఇప్పుడు రోడ్లు చూపించి అభివృద్ధి అని చెప్పొచ్చు. టోల్స్ ద్వారా భారీ డ‌బ్బులూ పొంద‌వ‌చ్చు. అభివృద్ధి అంటే రోడ్ల‌ను చూప‌డం, ఆదాయానికీ ఢోకా లేదు! ప్ర‌జ‌ల మీదే భారం.. ప్ర‌భుత్వానికి పేరు ప్ర‌ఖ్యాతులు బోన‌స్!

14 Replies to “టోల్ ఫీజుల‌తో 55 వేల కోట్ల రూపాయ‌లు!”

  1. లోకల్ కాలనీ రోడ్లు కూడా ఇలాగే చేస్తే ఇంకా బాగా పంట పండుతుంది.. ట్రాఫిక్ సమస్య కూడా బాగా తగ్గుతుంది…

    1. Gst and income tax స్లాబ్స్ ప్రకారం ఉంటాయి. 12 లక్షల ఆదాయం వరకు నో income tax and 24 లక్షల పైన ఆధాయం పైన మాత్రమే 30% tax

    2. Road tax is always separate, State govt collects 15-20% for roads but you are still paying extra toll for state roads. On top of state takes 9% from GST goes to state, why states collect toll on roads

      Total 1.7% pay income tax out of that how many pays 30% income tax?

  2. అందరూ కార్లు వదిలేసి, సైకిల్ తొక్కడం మొదలు పెట్టుతే , ఈ టోల్ కంపెను ల తిక్క కుదిరిడ్డి, డబ్బు కట్టే పని లేదు.

    మరి మొదలు పడదామా , సైకిల్ తొక్కడం.

  3. ఈ టోల్ కంపేను ఓనర్ లు అందరూ కూడా రాజకీయ నాయకులే కదా., వాళ్ళ పేర్లు ఇక్కడ రాసే దమ్ము ఉందా , గ్రేట్ ఆంద్ర?

Comments are closed.