జాతీయ మానవ హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించిన వైసీపీ

ఏపీలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోందంటూ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని వైసీపీ ఎంపీలు ఆశ్ర‌యించారు. త‌మ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నారంటూ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం యాక్టింగ్ చైర్‌ప‌ర్స‌న్…

ఏపీలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోందంటూ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని వైసీపీ ఎంపీలు ఆశ్ర‌యించారు. త‌మ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నారంటూ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం యాక్టింగ్ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌భార‌తికి వైసీపీ ఎంపీల బృందం విన‌తిప‌త్రం ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా అక్ర‌మంగా సాగుతున్న అరెస్ట్‌ల ప‌ర్వం గురించి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డంతో పాటు తాము చెప్పిన‌ట్టు వాంగ్మూలం ఇవ్వాల‌ని సోషల్ మీడియా యాక్టివిస్టుల‌పై పోలీసులు వేధింపుల‌కు పాల్ప‌డ‌డాన్ని ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. క‌స్ట‌డీలో హింసిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక గ‌ళాన్ని వినిపించ‌కుండా అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌స్తావించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను పోలీసులు తూట్లు పొడుస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై జోక్యం చేసుకోవాల‌ని వైసీపీ ఎంపీలు కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి చేశారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.

30 Replies to “జాతీయ మానవ హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించిన వైసీపీ”

  1. Ha! Ha!! LoL!!

    మానవ హక్కుల సంఘం కి ఎమని చెపుతారు?

    మాకు ఎదుటి పార్టి వారిని బూ.-.తు.-.లు తెట్టె హక్కు, మార్ఫింగ్ చెసి సొషల్ మీడియా లొ పొస్ట్ చెసె హక్కులని పొలీసులు హరిస్తున్నారు. కనుక మీరు జొక్యం చెసుకొని మా వారిని యదా విదిగా బూ.-.తు.-.లు తిట్ట నివ్వండి అని అడుగుతారా?

  2. ప్రతీ మనిషికీ పెరిగిన వాతావరణం, ప్రాంతం, పరిస్థితుల వల్ల ఎంత కాదనుకున్నా, ఒప్పుకోకపోయినా ఆవగింజ అంత కులాభిమానం, ప్రాంతీయాభిమానం, దేశాభిమానం సహజసిద్ధం గా అబ్బటం చెప్పుగోదగ్గ రుగ్మత కాకపోవచ్చు..

    ఆ ఆవగింజ పెరిగి పెరిగి కుల పిచ్చిగా మారి క్యాన్సర్ గా మారినప్పుడే జుగుప్సాకరమైన రాతలు, మాటలు వస్తాయి..వాళ్లు సమాజానికే కాదు, సొంత కుటుంబానికి కూడా ప్రమాదకరం..

  3. విజయభారతి = విజయ + భారతి…అన్న ఫామిలీ మెంబెర్స్ అందరు పేర్లు కలిపి ఉన్నాయి

  4. ఆ పోస్టులు చూశాక వాళ్లు అసలు మానవులే కాదు పొమ్మంటారేమో..చూసుకోబడ్లా..

  5. బోస్ గారు ఈ దారిద్ర గొట్టు పార్టీలో కన్నా వేరే పార్టీ లోనికి పోవటం మంచిది వైసీపీ ఇక అధికారం లోనికి రాదు వీళ్లకు తటస్థ ఓటర్ లు ఓట్లు వెయ్యరు కేవలం పథకాలు బ్యాచ్ వెయ్యాలి ఆ పథకాలు కూటమి ఇస్తుంది

Comments are closed.