చెయ్యెత్తితే.. మాట్లాడే అవ‌కాశంః స్పీక‌ర్‌

ఈ అసెంబ్లీలో కొత్త స‌భ్యులు ఎక్కువ మంది ఉన్నారు. అసెంబ్లీలో ఎలా న‌డుచుకోవాల‌నే విష‌య‌మై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం వ‌ర్క్ షాప్ నిర్వ‌హించింది. అసెంబ్లీలో స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అధ్య‌క్షత‌న అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు.…

ఈ అసెంబ్లీలో కొత్త స‌భ్యులు ఎక్కువ మంది ఉన్నారు. అసెంబ్లీలో ఎలా న‌డుచుకోవాల‌నే విష‌య‌మై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం వ‌ర్క్ షాప్ నిర్వ‌హించింది. అసెంబ్లీలో స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అధ్య‌క్షత‌న అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ సద‌స్సులో స్పీక‌ర్ మాట్లాడుతూ తాను నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌న్నారు.

మొద‌టిసారి ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. అసెంబ్లీ నియ‌మ నిబంధ‌న‌లు ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని అయ్య‌న్న‌పాత్రుడు కోరారు. అసెంబ్లీలో ప్ర‌తి రోజు ప‌ది ప్ర‌శ్న‌ల‌కే స‌మ‌యం స‌రిపోతోంద‌న్నారు. జీరో హ‌వ‌ర్స్‌లో స‌భ్యులెవ‌రైనా మాట్లాడాల‌ని భావిస్తే, చెయ్యెత్తితే చాలు, అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని అయ్య‌న్న‌పాత్రుడు అన్నారు.

అసెంబ్లీ స‌మావేశాల‌ను వైసీపీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కావున అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష‌మైన‌, అధికార ప‌క్ష‌మైన అంతా వాళ్లే. బ‌హుశా అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ ప్ర‌తిప‌క్షం లేకుండా ఇలా స‌భ న‌డవ‌కపోయి వుండొచ్చు.

6 Replies to “చెయ్యెత్తితే.. మాట్లాడే అవ‌కాశంః స్పీక‌ర్‌”

  1. బహుశా ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ చరిత్ర లో లేదేమో – ఓహో ఈ రికార్డు కూడా అనియ్యాదేనా? దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా చేస్తా అంటే ఇంకా ఎదో అనుకున్నాం…ఇదా!!!!

Comments are closed.