1000 రోజులు టైమ్.. మళ్లీ అవే తప్పులు?

మూడేళ్ల సుదీర్ఘ సమయం.. ఓ సీక్వెల్ తీయడానికి దర్శకుడు సుకుమార్ కు 1000 రోజులు టైమ్ కూడా సరిపోలేదు. పుష్ప రిలీజ్ టైమ్ లో ఎలాంటి హడావుడి, టెన్షన్ కనిపించిందో.. మూడేళ్ల పాటు తీసిన…

మూడేళ్ల సుదీర్ఘ సమయం.. ఓ సీక్వెల్ తీయడానికి దర్శకుడు సుకుమార్ కు 1000 రోజులు టైమ్ కూడా సరిపోలేదు. పుష్ప రిలీజ్ టైమ్ లో ఎలాంటి హడావుడి, టెన్షన్ కనిపించిందో.. మూడేళ్ల పాటు తీసిన పుష్ప-2 విషయంలో కూడా అదే హడావుడి-టెన్షన్ కనిపిస్తోంది.

పుష్ప సినిమా రిలీజైన వెంటనే వచ్చిన మొదటి విమర్శ, సీజీ వర్క్ బాగాలేదని. సినిమాలో కొన్ని సీన్స్ లో చూపించిన ఎర్ర చందనం దుంగలు అస్సలు నేచురల్ గా కనిపించలేదనేది ఓ విమర్శ. ఆఖరి నిమిషంలో సీజీలు యాడ్ చేయడం వల్ల వచ్చిన సమస్య అది. క్వాలిటీ తగ్గిందనే విషయం కళ్ల ముందు కనిపించినా ఏం చేయలేని పరిస్థితి. మరి మూడేళ్లు తీసిన పుష్ప-2 విషయంలో ఆ సమస్యను అధిగమించారా..?

గట్టిగా వినిపించిన మరో విమర్శ రీ-రికార్డింగ్. పార్ట్-1లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై అక్కడక్కడ విమర్శలు వినిపించాయి. అది కూడా ఆఖరి నిమిషం వర్క్ కిందే అనుకోవాలి. ఎందుకంటే, పుష్ప-2 రీ-రికార్డింగ్ కు సంబంధించి కూడా దేవిశ్రీపై అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఇప్పుడేమో ఆర్ఆర్ కోసం ఆఖరి నిమిషంలో ముగ్గురు సంగీత దర్శకుల్ని తీసుకున్నారు. మరి ఈ క్వాలిటీ ఎలా ఉంటుందో? సింక్ మిస్సవ్వకుండా ఎలా కో-ఆర్డినేట్ చేస్తారో?

పుష్ప-1, పుష్ప-2 మధ్య వెయ్యి రోజులుకు పైగా గ్యాప్ ఉంది. సినిమా చెక్కడానికి ఇంత భారీ టైమ్ కూడా యూనిట్ కు సరిపడినట్టు లేదు. ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఐటెంసాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ వారాంతానికి అవుతుందంటున్నారు. అది ఎడిటింగ్ చేయాలి, ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ చేయాలి.

ఇప్పటికైతే పుష్ప-2 తొలి సగం లాక్ అయిందని, రీ-రికార్డింగ్ కూడా పూర్తయిందనేది అధికారిక సమాచారం. మరి కీలకమైన సెకండాఫ్ సంగతేంటి? టాకీ పూర్తయింది.. ఎడిటింగ్ నడుస్తోంది.. సుకుమార్ చూడాల్సి ఉంది… లాక్ చేయాల్సి ఉంది.. ఇదీ తాజా సమాచారం.

చూస్తుంటే.. పుష్ప సినిమాకు జరిగినట్టుగానే పార్ట్-2 ప్రచారానికి కూడా సుకుమార్ అందుబాటులోకి వచ్చేలా లేడు. ఇంకా చెప్పాలంటే, పార్ట్-1 కంటే పార్ట్-2 వచ్చేసరికి అతడు మరింత బిజీ అయిపోయాడు.

ఐటెంసాంగ్ షూటింగ్, సెకండాఫ్ ఎడిటింగ్, రన్ టైమ్ లాక్.. ఇవన్నీ మరో వారం రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంది. లేదంటే సెన్సార్ సమస్యలు తలెత్తుతాయి. సో.. 17న పాట్నాలో జరిగే ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు సుక్కూ వచ్చేది అనుమానమే.

వెయ్యి రోజులు పట్టిన సినిమా, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాకు, ఆఖరి నిమిషంలో ఆ మాత్రం టెన్షన్ తప్పదా.. సుకుమార్ సినిమా కాబట్టి తప్పదనే అనుకోవాలి.

4 Replies to “1000 రోజులు టైమ్.. మళ్లీ అవే తప్పులు?”

Comments are closed.