ఒకవైపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, మరోవైపు కేబినెట్ ను పునర్వ్యస్థీకరించారు. ఇదే ఊపులో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి సారించినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీకి నూతన జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించారు. ఆ జాబితా ఇలా ఉంది.
అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నియమితం అయ్యారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా నియమితం అయ్యారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నియమితం అయ్యారు.
నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా కే సురేష్ బాబు, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు కేఆర్జే భరత్, సత్యసాయి జిల్లాకు ఎం శంకర్ నారాయణ, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బుర్రా మధుసూదన యాదవ్, కృష్ణా జిల్లాకు పేర్ని నాని నియమితం అయ్యారు.
ఏలూరుకు ఆళ్ల నాని, తూర్పు గోదావరికి జగ్గంపూడి రాజా, పగో జిల్లాకు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కాకినాడకు కురసాల, కొనసీమ జిల్లాకు పొన్నాడ సతీష్, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా మత్తంశెట్టి శ్రీనివాస్, అనకాపల్లి జిల్లాకు కరణం ధర్మశ్రీ, అల్లూరి జిల్లాకు భాగ్యలక్ష్మి, పార్వతీపురానికి పుష్ప శ్రీవాణి, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిన్న శ్రీను, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియమితం అయ్యారు.