వైసీపీ భవిష్యత్ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల్లోనే వుంది. జిల్లాల వారీగా ఆయన వైసీపీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన అంటున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని, తానెప్పుడూ ఇలాంటి ప్రజావ్యతిరేక సర్కార్‌ను చూడలేదని ఆయన పదేపదే అంటున్నారు. జగన్ పలావు పెట్టేవాడు, చంద్రబాబు వస్తే బిర్యానీ పెడతాడని జనం అనుకున్నారని, కానీ ఇప్పుడు రెండూ పోయాయని ఆవేదన చెందుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నారు.
కూటమి సర్కార్‌పై వ్యతిరేకత మొదలైన మాట నిజమే అనుకుందాం. ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారుతున్నదా? అనేదే ప్రశ్న. కూటమిపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకోడానికి జగన్ ఇప్పుడు చేస్తున్న పని ఎంత వరకు దోహదం చేస్తుందనే చర్చకు తెరలేచింది. కూటమి గ్రాఫ్ పడిపోతుందనే విషయంలో అందులోని నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ వైసీపీకు అదంతా అనుకూలంగా మారుతున్నదా? అనే ప్రశ్నకు మాత్రం… ఎవరూ ఔను అనే సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఉదాహరణకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే వాళ్లను ఉపేక్షించనని ఆయన హెచ్చరించారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వాళ్లే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. ఈ రకంగా ఎప్పుడైనా జగన్ అన్నారా? జగన్ మాటల తీరు చూస్తే… కూటమి ప్రభుత్వం హామీల్ని అమలు చేసే పరిస్థితి లేదని, అందువల్ల వైసీపీనే జనం మళ్లీ గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారనే అభిప్రాయం కలిగిస్తోంది.
ఇది సరైందా? అనేది జగనే ఆలోచించుకోవాల్సి వుంటుంది. గత ఐదేళ్లలో తన పాలనలో వైసీపీ కేడర్‌కు అన్యాయం జరిగిందని, ఇకపై అలా జరగదనే ఒకే ఒక్క మాట ఇంత వరకూ జగన్ నోటి నుంచి రాలేదన్న ఆవేదన వాళ్లలో వుంది. వైసీపీ కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా జగన్ నడుచుకుంటేనే రాజకీయ భవిష్యత్ వుంటుందని గ్రహించాలి.
కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి జగన్‌లో భవిష్యత్‌పై భరోసా కలిగిస్తోందన్నది నిజం. తానొక్కడే భవిష్యత్‌పై భరోసా పొందితే సరిపోదు కదా! కేడర్‌లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం ఏం చేస్తున్నారనేది ప్రధానం. తాడేపల్లికి నాయకుల్ని పిలిపించుకుని, రెండు మాటలు చెప్పి పంపితే సరిపోదు. తాడేపల్లిలో మాటలు విన్నంత వరకూ ఉత్సాహంగానే వుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవడం అంత సులువు కాదు.
కావున కూటమి వ్యతిరేకతను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోడానికి జగన్ వ్యూహం రచించాలి. సరైన టీమ్‌ను పెట్టుకోవాలి. ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర వేయించుకోకూడదు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రాంత నాయకుల్ని మరో ప్రాంతంపై రుద్దడం మానుకోవాలి. అసలు వైసీపీ కేడర్ మనసులో ఏముందో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తేనే భవిష్యత్ వుంటుందని జగన్ గుర్తించాలి.
ee PALAAVU. BIRYAANI story entraa baabu.. Aavu/Puli kadha lagaa…
😂
మావోడి భవిష్యత్తు అంతా EVMల్లో కదా?? క్యాడర్ అనబడే ‘లేకి నాకొడుకులు’ ఎం చేస్తారు?? 11 రూ పడేస్తే తిని తొంగుంటారు..
అన్నయ్య బర్త్‌డేకి 11 మంది కలిపి క్రికెట్ ప్లాన్ చేసారు అంట కదా!
మావోడి భవిష్యత్తు అంతా ఆడి అతిమంచితనం, అతి నిజాయితీ మీద కదా దాక్కుంది??
వైసీపీ భవిష్యత్తు అంతా జెగ్గుల్ “కళ్ళల్లో ఉంది.. కార్యకర్తల్లో కాదు”
5 ఏళ్ళు కేవలం కళ్ళు మూసుకోవడం లోనే బంపర్ భవిష్యత్తు దాగుంది తెలుసా??
మీరంతా కష్టపడి పనిచేసి నన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో బెట్టండి నేను ప్రశాంతంగా ప్యాలెస్ లో ఉండి పాలన చేస్తాను : అన్నయ్య
పథకాలు పోయిన వాళ్ళు ఈయన వంక చూస్తారు వచ్చే వాళ్ళు ఎందుకు చూస్తారు నుఎట్రాల్ వోటింగ్ ఎటు cbn పవన్ దే ఈ పదకొండుకు కన్నా పెరగటం కష్టం వోటింగ్ కూడా 25 -30 % మద్యే ఉంటుంది రోడ్ అవసరం వున్నవాళ్లు జాబ్ అవసరం వున్నవాళ్లు ఎవరు ఈయనకు వేయరు ఈయనకు వచ్చే ఓట్లు అర్హత లేకపోయినా గవర్నమెంట్ పథకాలు తీసుకొనే వాళ్ళు వేయాలి
వాడికి వాడు ఏదో పెద్ద దైవాంశ సంభూతుడు లాగా ప్రవర్తిస్తుంటాడు, వాడేదో దైవ ధూత లాగా వీడిని మించిన నాయకుడు లేడు అన్నట్టు వీడు , వీడిదే గొప్ప పాలన అన్నట్టు ట్రాన్స్ లో నటిస్తుంటాడు. కొండెర్రి హూకు లాంటి హావభావాలు , పార్టీ వీడి చేతిలో ఏప్పుడో భూస్దాపితం అయిపోయింది, ఇంక వీడిని నమ్మి ఎవడు రాజకీయాలు చేయడు
వాడికి వాడు ఏదో పెద్ద దైవాంశ సంభూతుడు లాగా ప్రవర్తిస్తుంటాడు, వాడేదో దైవ ధూత లాగా వీడిని మించిన నాయకుడు లేడు అన్నట్టు వీడు , వీడిదే గొప్ప పాలన అన్నట్టు ట్రాన్స్ లో నటిస్తుంటాడు. కొండ ఎ ర్ హూకు లాంటి హావభావాలు , పార్టీ వీడి చేతిలో ఏప్పుడో భూస్దాపితం అయిపోయింది, ఇంక వీడిని నమ్మి ఎవడు రాజకీయాలు చేయడు
y c p vallu వీడు సోలుచెప్తుంటే విసిగిపోయి ఏమి అనలేక ఉండిపోవడం చూస్తున్నాం
కొత్త స్క్రిప్ట్ వచ్చేవరకు అంతే…