యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, యూఏఈ ముఖ్య సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మీడియా మరియు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి గారు, కువైట్ కమిటీ సభ్యులు మరియు యూఏఈ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా సైనికులు వైయస్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గొన్నారు.
సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ.. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న మీద మీరు చూపించే అభిమానం నాకు మరింత స్ఫూర్తి నిచ్చింది. రాబోయే ఎన్నికలు పేదలకు మరియు పెత్తందారులకు మధ్య, ఈ యుద్ధంలో మన జగనన్న పేదలకు అండగా నిలుస్తున్నారు, అలాంటి గొప్ప నాయకుడికి తోడుగా మనం అందరం సైనికుల్లా కష్టపడి 175 టార్గెట్ గా పని చేయాలి. పేదలకు మంచి చేసే గొప్ప మనసే కాదు అవినీతి, అక్రమాలు చేసే వారి మీద పోరాటం చేయగల సత్తా ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది అని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి సజ్జల భార్గవ గారు అన్నారు.
మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఒక గొప్ప నాయకుడి కోసం పని చేయడం చాలా గర్వంగా ఉంది. పుట్టిన గడ్డ వదిలి ఇంత దూరం వచ్చి మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నా కూడా రోజులో కొంత సమయాన్ని జగనన్న కోసం వెచ్చించడం అభినందించాల్సిన విషయం. ప్రవాసంధ్రులకు జగనన్న ఎప్పుడూ అండగా ఉంటారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు “జగనన్న విదేశీ విద్యా దీవెన” కార్యక్రమం చేపట్టి కోటి రూపాయల వరకూ కూడా ఫీజు చెల్లిస్తున్న మనసున్న నాయకుడు జగన్ గారు అని ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. ఎవరైనా ఒక సిటినో, ఒక ప్రాంతాన్నో అభివృద్ధి చేస్తారు కానీ జగన్ గారు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూళ్లు, విలేజ్ క్లినిక్ లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మీ సొంత గ్రామం వెళ్ళినప్పుడు చూడండి, మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు మీ గ్రామం ఎలా ఉందో గమనించండి. జగనన్న తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు ఇతర రాష్ట్రాలతో పాటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి గొప్ప నాయకుడి కోసం పని చేస్తున్నందుకు మనం అందరం గర్వపడాలి మరింత కష్టపడి పని చేయాలి అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
దుబాయ్ లో ఉంటున్న వైయస్ఆర్ సీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు కూడా పాల్గొనడం విశేషం.