టీడీపీ హయాంలో విద్యా రంగం వెలిగిపోయిందా…?

ఏపీలో విద్యారంగం ఈ రోజుకు ఈ రోజు కునారిల్లినట్లుగా విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ప్రత్యేకించి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీలో అందరూ  విరుచుకుపడుతున్నారు. ఇక మాజీ విద్య్యా శాఖ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు…

ఏపీలో విద్యారంగం ఈ రోజుకు ఈ రోజు కునారిల్లినట్లుగా విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ప్రత్యేకించి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీలో అందరూ  విరుచుకుపడుతున్నారు. ఇక మాజీ విద్య్యా శాఖ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు అయితే వైసీపీ మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు.

ఆయన ఇపుడే నిద్రలేచినట్లుగా మాట్లాడుతున్నారని ప్రత్యర్ధులు ఘాటుగానే అంటున్నారు. టీడీపీ అయిదేళ్ల కాలంలో విద్యా రంగంలో జరిగిన అనేక అవకతవకల మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాళ్ళు కూడా వస్తున్నాయి. నాడు ఉద్యోగ నియామకాలలో జరిగిన అవినీతి, అలాగే స్టేషనరీ కొనుగోళ్ళకు సంబంధించి జరిగిన అవినీతి మీద కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

ఇక చూస్తే నాడు జరిగిన అన్ని అవినీతి విషయాన పైనా, కుంభకోణాల పైన, స్కాముల పైన బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సేవ్ ఉత్తరాంధ్రా ఫోరం అంటోంది. మరి ఆ మధ్య అయితే ఎంపీ విజయసాయిరెడ్డి నాటి సర్కార్ హయాంలో సైకిల్ బెల్ గంటలో కూడా అవినీతి మోగింది అంటూ సెటైర్లు వేసిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.

టెన్త్ ఫలితాలలో ఉత్తీర్ణత తగ్గింది అంటే అంత నిక్కచ్చిగా పరీక్షల నిర్వహణ చేసి స్పాట్ వాల్యుయేషన్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. అప్పట్లో అయితే విద్యా వ్యాపారమే సాగడం వల్ల ఫలితాలు ర్యాంకులు అన్నీ అదిరిపోయేవని కూడా అంటున్నారు. టీడీపీ అయిదేళ్ల ఏలుబడిలో విద్యారంగం ఎంత వెలిగిపోయిందో చర్చకు సిద్ధమా అని నిలదీస్తున్నారు.