ఇన్ని రోజులు రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీపై ఎన్ని విమర్శలు చేస్తున్న సైలెంట్ గా ఉంటూ వస్తున్న వైసీపీ నేతలు.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు డైరెక్ట్ గా సీఎం జగన్ పై విమర్శలు చేయడంతో అదే రీతిలో వైసీపీ నాయకులు కూడా బీజేపీపై విరుచుకుపడుతున్నారు.
ఇవాళ విశాఖపట్నంలో టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడిందని.. అందుకే టీడీపీ నేతల మాటలే అమిత్ షా మాట్లాడారని.. ఆయన సభా వేదికపై వున్నవారంతా కూడా టీడీపీ నాయకులేనని పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే అంటూ మండిపడ్డారు.
గతంలో బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తునే బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. 2014-19లో టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిన మేలు గురించి, టీడీపీ అవినీతి గురించి మాట్లాడింటే బాగుండేదని హితవు పలికారు. వైజాగ్ వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం దారుణం అన్నారు.
కాగా కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే జనసేన- టీడీపీ పార్టీల పొత్తు ఖాయం కాగా. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే టీడీపీ-జనసేనలతో బీజేపీ దాదాపు కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.