Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎన్నికలు బహిష్కరిస్తున్న విశాఖలోని గ్రామం

ఎన్నికలు బహిష్కరిస్తున్న విశాఖలోని గ్రామం

ఎన్నికలు వద్దు మాకు ఓటు వేసే భారం వద్దు అని ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక గ్రామం అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చేసింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన మా సమస్యలు తీరనప్పుడు ఎందుకు ఓట్లు వేయాలి, మీకు పదవులు ఎందుకు ఇవ్వాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. విశాఖ పారిశ్రామిక వాడలొ ఉన్న ఆ గ్రామం పేరు మూల స్వయంవరం.

ఈ గ్రామస్థులు ఆదివారం సమావేశం జరిపి ఏకగ్రీవంగా ఓటింగుకు తాము దూరం అని తీర్మానించారు. తమ ఊరికి ఎవరూ ఓటు కోసం రావద్దు అని చెప్పేస్తున్నారు. ఈ గ్రామం ఎన్టీపీసీ కాలుష్యంతో సతమతమవుతోంది. తమ గ్రామానికి సింహాద్రి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి కాలుష్యం పెద్ద ఎత్తున వస్తోందని దాంతో తమ జీవితాలు ఆరోగ్యాలు బుగ్గి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి గాలి లేదు, నీరు లేదు అనేక జబ్బులు తమను పట్టి పీడిస్తున్నాయని వారు అంటున్నారు. చాలామంది చనిపోతున్నారు. ఇంకా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని వారు ఆందోళన కలిగించే విషయాలు చెప్పారు. తమ గ్రామంలో చెట్లు పెరగవని అంతా ధూళితోనే ఉంటుందని  వ్యాధులు తమ గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని వాపోయారు. సింహాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలను అక్కడ నుంచి వేరే సురక్షితమైన చోటుకు తరలించి కొత్తగా ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సిన పాలకులు ప్రాజెక్టు పెద్దలకు ఆ ధ్యాస లేకుండా పోయిందని అంటున్నారు.

తాము చీకటితో ఉంటే సింహాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందించే విద్యుత్ దేశానికి వెలుగు ఇస్తోందని వారు అంటున్నారు. తమ త్యాగాలు మరణానికి దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా కిడ్నీ వ్యాధి బాధితులు ఊపిరితిత్తుల వ్యాధి బాధితులు, గుండె జబ్బు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారని అంటున్నారు. అలాగే వినికిడి లోపం వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు.

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ గ్రామం ఓట్లు వేయమని అంటోంది. ఇదే బాటలో మరిన్ని కాలుష్య బాధిత గ్రామాలు కూడా జత కలవనున్నాయి. వీరిని రాజకీయ పార్టీలు ఎలా ఒప్పించి మెప్పిస్తాయో చూడాలని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?