Advertisement

Advertisement


Home > Politics - Andhra

కొత్తపేరుతో సాగనున్న ‘నిజం గెలవాలి’ డ్రామా!

కొత్తపేరుతో సాగనున్న ‘నిజం గెలవాలి’ డ్రామా!

‘నిజం గెలవాలి’ అనే పేరుతో నారా భువనేశ్వరి ఇన్నాళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక సుదీర్ఘమైన యాత్రను సాగించారు. సూటిగా చెప్పాలంటే ఇది పరామర్శల యాత్ర కాదు. ఎన్నికల ప్రచార యాత్ర అన్నట్టుగానే ప్రతిచోటా సాగింది. నిత్యం ఎన్నికల ప్రచారంలో ఉండడం, నిత్యం జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉండడం.. ఈ వ్యవహారాలు ఆమెకు బాగా కిక్ ఇచ్చినట్టుగా ఉన్నాయి.

‘నిజం గెలవాలి’ అనే యాత్రకు ‘మరణించిన అభిమానులు’ అనే ముసుగు తొడిగారు. ఇప్పుడు ఆ జాబితా అయిపోయింది. అందుకే ఒక సరికొత్త పేరు తగిలించుకుని, ఈ తరహా ఎన్నికల ప్రచార యాత్రను యథావిధిగా కొనసాగించాలని నారా భువనేశ్వరి భావిస్తున్నారు.

‘నిజం గెలవాలి’ అనే యాత్ర నిజానికి ఒక పెద్ద డ్రామా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చేసిన అవినీతికి పరిహారంగా చంద్రబాబునాయుడు అరెస్టు అయిన సందర్భంలో ఆయన ఇక ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదని, కేసు అంత గట్టిగా ఉన్నదని తెలుగుదేశం దళాలు భయపడ్డాయి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మేలుకోవడం కొంటె, కాస్త ముందస్తు కసరత్తుగా ఉంటుందని నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్త యాత్ర చేయాలనుకున్నారు. అది తమ పట్ల సానుభూతిని సృష్టించుకోవడం కోసం చేసిన యాత్ర. కానీ, దానిని ప్రజల మీద సానుభూతితో చేస్తున్న యాత్రగా రంగుపులిమారు.

చంద్రబాబును అరెస్టు చేయగానే.. ఆయన అభిమానులు గుండె పగిలి మరణించారని, వారి కుటుంబాలను పరామర్శించాలని ఆమె ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని యాత్ర ప్రారంభించారు. ప్రతి చోటా పరామర్శల కంటె జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడమే ప్రధానంగా ఆ యాత్ర సాగింది. అది కూడా నిన్నటితో అయిపోయింది. 203 కుటుంబాలను పరామర్శించారట.

‘నిజం గెలవాలి’ యాత్ర అయిపోయింది గానీ.. మరో పేరుతో ఒక సరికొత్త యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ఉన్నదని, మే 10వ తేదీ వరకు ప్రజల్లోనే ఎన్నికల ప్రచార యాత్రల్లోనే ఉంటానని భువనేశ్వరి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడుగా ఎన్నికల ప్రచార యాత్రలు సాగిస్తుండగా.. విపక్ష కూటమిలో ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన నాయకులు ముమ్మరంగా ప్రచారసభలు పెడుతున్నారు. దానికి తోడు.. నారా- నందమూరి కుటుంబం నుంచి ఆల్రెడీ చంద్రబాబు, బాలయ్య ప్రచారంలో రాష్ట్రం తిరుగుతున్నారు. వారికి తోడు భువనేశ్వరి కూడా రాష్ట్రమంతా తిరిగి జగన్ ను తిట్టిపోయాలని ముచ్చటపడుతున్నారు.

నారా లోకేష్ కు పాపం మంగళగిరి నుంచి కాలు బయటపెట్టేంత ధైర్యం చిక్కడం లేదు. మొత్తానికి కుప్పంలో నాకే పోటీ చేయాలని ఉంది అని గతంలో ప్రకటించి సంకేతాలు ఇచ్చిన భువనేశ్వరి, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోననే ఉద్దేశంతో.. ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?