Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

అయ్యన్నకు షాక్ ఇచ్చిన కింగ్ మేకర్!

అయ్యన్నకు షాక్ ఇచ్చిన కింగ్ మేకర్!

నర్శీపట్నంలో ఈసారి ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ సాగనుంది. అయ్యన్నపాత్రుడు పదవ సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు అని అంటున్నారు. ఏడు పదుల వయసు చేరువకు వచ్చిన అయ్యన్న ఈసారి గెలిస్తే అయిదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగాలని చూస్తున్నారు.

అయ్యన్నపాత్రుడికి వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నర్శీపట్నం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ 2014లోనే కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి పాతిక వేల ఓట్ల తేడాతో అయ్యన్నను ఓడించారు. ఈసారి ముప్పయి వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయ్యన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పెట్ల తన విజయాన్ని ఖాయం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీలోకి కీలక నేతలకు ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఒకనాడు నర్శీపట్నం రాజకీయాల్లో కింగ్ మేకర్ అన్న పేరు తెచ్చుకున్న రుత్తల ఎర్రాపాత్రుడుని వైసీపీ వైపు నడిపించడంతో పెట్ల విజయం సాధించారు.

ఎర్రాపాత్రుడు 2019లో అయ్యన్న క్యాంప్ లో ఉన్నారు. ఆయన విజయం కోసం కృషి చేశారు. నర్శీపట్నం వ్యాప్తంగా ఆయనకు పట్టు ఉంది. ఇప్పటికే అయ్యన్న తమ్ముడుని తమ వైపు తిప్పుకున్న వైసీపీ టీడీపీ జనసేనలలో అసంతృప్తి నేతలకు గేలం వేస్తోంది. జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న ఎర్రాపాత్రుడు రాజకీయంగా రాటు తేలిన నేత. ఆయన 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపుగా ఇరవై వేల ఓట్లను సాధించారు.

నర్శీపట్నంలో ప్రతీ ఒక్క ఓటూ కీలకం అని భావిస్తున్న వైసీపీ జాగ్రత్తగా రాజకీయం చేస్తోంది. అయ్యన్నకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఏకం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు. దాంతో రానున్న రోజులలో టీడీపీకి గెలుపు కష్టమన్న భావనను ముందే కలుగ చేస్తున్నారు. ఈసారి కూడా వైసీపీ జెండా ఎగరేస్తామని పెట్ల బల్లగుద్ది చెబుతున్నారు. ఈసారి వ్యక్తులు పార్టీల కంటే కూడా వైసీపీ అమలు చేసిన సంక్షేమ పధకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రత్యర్ధుల సంప్రదాయ ఓట్లు కూడా వైసీపీ ఖాతాలో పడి ఊహించని మెజారిటీ వస్తుందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?