Advertisement

Advertisement


Home > Politics - Andhra

సిక్కోలులో టీడీపీ భారీ షాక్?

సిక్కోలులో టీడీపీ భారీ షాక్?

తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అయిన శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులు పార్టీకి దండం పెట్టేశారు అని అంటున్నారు. ఎన్టీఆర్ జమానా నుంచి పార్టీలో ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పదవులు నిర్వహించి ఆ తరువాత కూడా బాబుకు విధేయుడిగా ఉంటూ వచ్చిన గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టీడీపీ ఈసారి టికెట్ పార్టీ ఇవ్వలేదు. 2014లో ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవికి పార్టీ టికెట్ ఇస్తే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుని ఓడించి గెలిచారు ఆమె.

ఇక 2019లో కూడా గుండ లక్ష్మీ దేవి విజయానికి సొంత పార్టీ వారే బ్రేక్ వేశారని ప్రచారంలో ఉంది. ఈసారి ఆమెకు టికెట్ రాకుండా జిల్లా పెద్దలు పావులు కదిపారని గుండా వర్గం ఆరోపిస్తుంది. శ్రీకాకుళంలో చంద్రబాబు తాజాగా చేసిన పర్యటనలో టికెట్ విషయం తేల్చేసారు అని అంటున్నారు.

శ్రీకాకుళం టికెట్ ని గోండు శంకర్ కి ఇచ్చామని సహకరించాలని బాబు చెప్పారని అంటున్నారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని మార్చేది లేదని కూడా స్పష్టం చేశారు అని అంటున్నారు. దాంతో చెప్పాల్సింది అంతా చెప్పిన గుండ దంపతులు బాబు స్పందనను చూసి తీవ్ర నిరాశకు గురి అయ్యారని అంటున్నారు.

దాంతో ఆయనకు నమస్కారం పెట్టేసి బయటకు వచ్చారని తెలుస్తోంది. ఆ తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూ గుండా దంపతుల నుంచి ప్రకటన వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఒకటి రెండు రోజులలో అనుచరులతో చర్చించి సంచలన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే విషయం గుండా వర్గం చర్చిస్తోందని అంటున్నారు. అదే కనుక జరిగితే శ్రీకాకుళం అసెంబ్లీ సీటు మాత్రమే కాదు ఎంపీ సీటు విషయంలోనూ టీడీపీ డౌట్ పడాల్సిందే అని అంటున్నారు. గుండా కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?