Advertisement

Advertisement


Home > Politics - Andhra

బొత్స ఝాన్సీ.. పార్ల‌మెంటేరియ‌న్ గా ధీటైన ట్రాక్ రికార్డ్!

బొత్స ఝాన్సీ.. పార్ల‌మెంటేరియ‌న్ గా ధీటైన ట్రాక్ రికార్డ్!

సాధార‌ణంగా ఎవ‌రైనా రాజ‌కీయ నేత భార్య ప్ర‌జాప్ర‌తినిధి హోదాలో ఉందంటే.. ఆమెను త‌క్కువ అంచ‌నా వేస్తారు! భార‌త ప్ర‌జాస్వామ్యంలో అలాంటి పరిస్థితి ఉంటుంది. దేశంలో చాలామంది రాజ‌కీయ నేత‌లు త‌మ భార్య‌ల‌ను ఆప‌ద్ధ‌ర్మంగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చారు! భార్య‌ను సీట్లో కూర్చోబెట్టి అంతా తామే చ‌క్రం తిప్పే వాళ్లు కోకొల్ల‌లు! రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉన్న సీట్ల విష‌యంలో కూడా ఇలాగే జ‌రుగుతూ ఉంటుంది. ఇక భ‌ర్త పేరున్న రాజ‌కీయ నేత కావ‌డంతో.. కుటుంబం ప్రాతినిధ్యం కోస‌మో, స్టేట‌స్ కోస‌మో చాలా మంది ఎంపీల‌వుతూ ఉంటారు!

మ‌రి అలాంటి రాజ‌కీయ నేప‌థ్యం నుంచినే వ‌చ్చినా.. పార్ల‌మెంట్ లో త‌న వాణి వినిపిస్తూ లోక్ స‌భ స‌భ్యురాలిగా త‌న విధుల‌ను వంద‌కు వంద శాతం నిర్వ‌హిస్తూ బొత్స ఝాన్సీ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ప్ర‌స్తుతం విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా నిలిచిన ఝాన్సీ.. త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగానే లోక్ స‌భ‌లో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ట్రాక్ రికార్డు చెబుతోంది.

దీనికి సాక్ష్యం భార‌త లోక్ స‌భ గణాంకాలే. లోక్ స‌భ‌కు ఝాన్సీ హాజ‌రు శాతం 88! దేశంలో లోక్ స‌భ స‌భ్యుల యావ‌రేజ్ అటెండెన్స్ 76 మాత్రమే! ఒక మ‌హిళా ఎంపీ ఇలా 88 శాతం హాజ‌రీ న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఐదేళ్ల లో లోక్ స‌భ్యురాలిగా ఝాన్సీ ఏకంగా 146 డిబేట్స్ లో పాలుపంచుకున్నారు. ప్ర‌జాప్ర‌తినిధిగా త‌న వాణి వినిపించారు. స‌గ‌టున ఒక్కో లోక్ స‌భ్యుడు పాల్గొనే డిబేట్ ల సంఖ్య కేవ‌లం 37 మాత్ర‌మే! బొత్స ఝాన్సీ ఏకంగా 146 డిబేట్స్  లో పాలుపంచుకున్నారంటే స‌భా కార్య‌క్ర‌మాల్లో ఆమె పాలుపంచుకుంటున్న తీరును అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక స‌భ‌లో ఆమె అడిగిన ప్ర‌శ్న‌ల సంఖ్య కూడా చాలా మంది ఎంపీల క‌న్నా చాలా ఎక్కువ ఉంది. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ఝాన్సీ ఏకంగా 377 ప్ర‌శ్న‌ల‌ను స‌భ ముందుకు తీసుకొచ్చారు! ఇది ఎంపీల స‌గ‌టు ప్ర‌శ్న‌ల‌తో పోలిస్తే గ‌ణ‌నీయంగా ఎక్కువ‌!

ఎంపీగా త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన అంశాల‌ను అయినా, దేశంలోని ఇత‌ర అంశాల‌ను అయినా ఇలా స‌భ‌లో ప్ర‌స్తావిస్తూ ఝాన్సీ త‌న బాధ్య‌త‌ను వంద‌కు వంద మార్కుల‌ను పొందేలా నిర్వ‌ర్తిస్తున్నారు. 

కేవ‌లం ప్ర‌శ్న‌లు అడిగడ‌మే కాకుండా... ప్ర‌స్తావించిన అంశాల‌ను స‌ద‌రు మంత్రిత్వ శాఖ వ‌ద్ద ఫాలోఅప్ చేసుకుంటూ కూడా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తూ ఉన్నారామె.  బాధ్య‌తాయుత‌మైన ఎంపీల‌కు కూడా లోక్ స‌భ‌లో ప్ర‌శ్న‌లు అడ‌గడం అంత తేలిక కాదు. .అందుకే చాలామంది ఏదో ఎంపీలుగా త‌మ హోదానే ఎంజాయ్ చేస్తూ కాలం గ‌డిపేస్తారు. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌లో కూడా అర్థ‌ముండాలి, దానికి అర్హ‌త ఉండాలి. అప్పుడే జీరో అవ‌ర్ లో అవకాశం వ‌స్తుంది. అలా విలువైన అంశాల‌ను ఝాన్సీ స‌భ ముందుకు తీసుకొచ్చి, వాటిని ప‌రిష్కార మార్గాలకు చేర్చి, సంస‌ద్ ర‌త్న అవార్డును కూడా పొందారు. ప్ర‌స్తుతం ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. న‌గర ప్రాంతానికి ఇలాంటి ఎంపీ క‌చ్చితంగా అడ్వాంటేజ్ అవుతార‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?