Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం.. భ‌యంతోనే చంద్ర‌బాబు స్పంద‌న‌!

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం.. భ‌యంతోనే చంద్ర‌బాబు స్పంద‌న‌!

ఏపీ ముఖ్య‌మంత్రిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన వెంట‌నే ఏపీ ఉలిక్కిప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్, అభిమానులు, సామాన్య ప్ర‌జానీకం కూడా నివ్వెర‌పోయింది. రాజ‌కీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు ఇలాంటి చర్య‌లకు పాల్ప‌డుతున్నాయ‌నే స్పంద‌న వ్య‌క్తం అయ్యింది.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే ఈ అంశంపై జాతీయ రాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ట్విట‌ర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు. జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాలనే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి- బీఆర్ఎస్ నేత కేసీఆర్ ట్విటర్ లో స్పందించారు. అప్ప‌టికే తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. కానీ.. జ‌గ‌న్ పై క‌నీసం సానుభూతితో కాదు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు కూడ‌ద‌ని కాదు, ఇది కోడిక‌త్తి డ్రామా అంటూ తెలుగుదేశం పార్టీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. సానుభూతి కోసం జ‌గ‌న్ త‌న‌పై తాను దాడి చేయించుకున్నాడంటూ తెలుగుదేశం అధికారిక సోష‌ల్ మీడియా త‌న ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఇక ప‌చ్చ కుక్క‌ల సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! పిచ్చిపిచ్చి లాజిక్కులు చెబుతూ.. త‌మ‌దైన ప్రోప‌గండాను చేస్తున్నాయి. 

అయితే.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మాత్రం తెలుగుదేశం సోషల్ మీడియాకు, అధికారిక‌, అన‌ధికార మీడియాకు విరుద్ధంగా స్పందించారు. సీబీఐ విచార‌ణ‌.. అదీ ఇదీ అంటూ మాట్లాడినా, తెలుగుదేశం ఆస్థాన మీడియాలా చంద్ర‌బాబు స్పందించ‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌ధానితో స‌హా ఇత‌ర రాష్ట్రాల నేత‌ల స్పంద‌న‌తో చంద్ర‌బాబు భ‌య‌ప‌డ్డాడు.

లేక‌పోతే.. తెలుగుదేశం సోష‌ల్ మీడియా లో పోస్టు చేసిన వాటినే చంద్ర‌బాబు సోషల్ మీడియాలో కూడా  పోస్టు చేసేవార‌న‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. కేవ‌లం మోడీ స్పంద‌న‌తో.. ప‌క్క రాష్ట్రాల వారి స్పంద‌న‌తో చంద్ర‌బాబు వెన‌క్కు త‌గ్గిన‌ట్టుగా ఉన్నారు. అక్క‌డ‌కూ వారంతా స్పందించిన త‌ర్వాత‌.. ఇక స్పందించ‌క‌పోతే బాగుండ‌ద‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు స్పంద‌న ఉంది. అందులో కూడా.. ఈ వ్య‌వ‌హారం లో త‌మ‌కు అనుకూలంగా నానాల‌నే ఆకాంక్షే క‌నిపించింది. అలా కూడా చంద్ర‌బాబు ట్వీట్ల‌లో అయినా నిజాయితీని క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?