Advertisement

Advertisement


Home > Politics - Andhra

హ‌లో కూట‌మి.. స్థానికేత‌రుడ‌ని ర‌చ్చ చేయండి చూద్దాం!

హ‌లో కూట‌మి.. స్థానికేత‌రుడ‌ని ర‌చ్చ చేయండి చూద్దాం!

చిత్తూరు లోక్‌స‌భ (ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌) టీడీపీ అభ్య‌ర్థిగా ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్‌రావును చంద్ర‌బాబునాయుడు ఖ‌రారు చేశారు. ఈయ‌న అభ్య‌ర్థిత్వంపై చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా తిరుప‌తిలో కూట‌మి త‌ర‌పున‌ జ‌న‌సేన అభ్య‌ర్థి ఆర‌ణి శ్రీ‌నివాసులు అలియాస్ జంగాల‌ప‌ల్లి శ్రీ‌నివాసులు స్థానికేత‌రుడ‌ని అక్క‌డి టికెట్ ఆశావ‌హులు వ్య‌తిరేకిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జంగాల‌ప‌ల్లిని మార్చాల్సిందే అంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, ఆమెతో పాటు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చిత్తూరులో చంద్ర‌బాబునాయుడు నిల‌బెట్టిన ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్‌రావును కూడా ఇదే ర‌కంగా వ్య‌తిరేకించ‌గ‌ల‌రా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. క‌నీసం జంగాల‌ప‌ల్లి చిత్తూరు వాసి. కానీ చిత్తూరు టీడీపీ అభ్య‌ర్థికి ఈ జిల్లాతో ఎలాంటి సంబంధం లేదు. ప్ర‌సాద్‌రావు బాప‌ట్ల జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం చిన్న‌గంజాం మండ‌లం చింత‌గుంప‌ల్లె గ్రామ నివాసి. ఈయ‌న మాజీ ఐఆర్ఎస్ అధికారి.

తిరుప‌తికి జంగాల‌ప‌ల్లి స్థానికేత‌రుడ‌ని తెగ ర‌చ్చ చేస్తున్న టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు... త‌మ నాయ‌కుడు చిత్తూరు పార్ల‌మెంట్‌కు నిల‌బెట్టిన అభ్య‌ర్థి విష‌య‌మై కూడా ఈ విధంగానే మాట్లాడ‌గ‌ల‌రా? మాట్లాడ‌లేరు. ఎందుకంటే చంద్ర‌బాబు నిలిపిన నాయ‌కుడు కాబ‌ట్టి. తిరుప‌తిలో మాత్రం కూట‌మి త‌ర‌పున జ‌న‌సేన అభ్య‌ర్థి శ్రీ‌నివాసులు కావ‌డంతో, ప‌వ‌న్‌ను బెదిరిస్తే భ‌య‌ప‌డి నిర్ణ‌యాన్ని మార్చుకుంటాడ‌నే న‌మ్మ‌కం. అప్పుడు త‌మ‌కు టికెట్ వ‌స్తుంద‌నే ఆశ‌.

ఇప్పుడు స్థానిక‌, స్థానికేత‌రుడ‌నే వాద‌న‌కు కాలం చెల్లింది. వైసీపీ , టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌ను నిల‌బెడుతున్నారు. వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అనేది నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌పైన ఆధార‌ప‌డి వుంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌బెడితేనే ఎందుకు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటే, ఆయ‌న‌కు అంత సీన్ లేద‌నే భావ‌న వుండ‌డ‌మే. అందుకే తిరుప‌తిలోనూ, చివ‌రికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేస్తున్న‌ పిఠాపురంలోనూ స్థానికేత‌రుల‌నే వివాదం త‌లెత్త‌డం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?