Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

ఆత్మకూరులో భారీ పోలింగ్ పై అనుమానాలు?

ఆత్మకూరులో భారీ పోలింగ్ పై అనుమానాలు?

ఆత్మకూరులో గెలుపు వైసీపీదే అనే విషయం అందరికీ తెలుసు. అయితే మెజారిటీ ఎంత వస్తుందనేదే వైసీపీ టార్గెట్. వాళ్ల ప్రచారం కూడా ఈ దిశగానే సాగింది. 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో, లక్ష పైచిలుకు మెజారిటీ సాధించాలనేది వైసీపీ టార్గెట్. అయితే ఇప్పుడా టార్గెట్ పై కొన్ని అనుమానాలున్నాయి. దీనికి కారణం పోటీగా నిలిచిన అభ్యర్థులు కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83శాతం పోలింగ్ జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ జరిగితే వైసీపీ ఆశిస్తున్న లక్ష మెజారిటీ ఖాయంగా వస్తుంది. కానీ పోలింగ్ పర్సంటేజీపై కొన్ని అనుమానాలున్నాయి. ఉప ఎన్నిక కావడంతో చాలామంది ఈ ఎన్నికను లైట్ తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి అంత వేవ్ కనిపించకపోవచ్చనేది ఓ అంచనా.

ఆత్మకూరు నియోజకవర్గంలో పురుషుల కంటే, మహిళా ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు. వాళ్లలో చాలామంది స్థానికంగా లేరనేది మరో అంచనా. దీనికి కారణం బ్రహ్మోత్సవాలు. స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందిన నర్రవాడలోని వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది మహిళలు తరలివెళ్లారు. వీళ్ల ఓట్లు మిస్సయ్యే అవకాశం ఉంది.

మరోవైపు వాతావరణ మార్పులు కూడా పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొన్నటివరకు ఎండలు. నిన్నట్నుంచి మాత్రం వర్షాలు. రాత్రి పెద్ద వర్షం పడింది. ఈరోజు కూడా మేఘావృతమై ఉంది. భారీ వర్షం పడితే ఓట్లు వేసేందుకు ఎవ్వరూ ముందుకురారు.

ఇలా పలు కారణాల వల్ల 2019తో పోలిస్తే, ఆత్మకూరులో పోలింగ్ పర్సంటేజీ తగ్గొచ్చని చెబుతున్నారు కొంతమంది. అయితే ఈ అంచనాల్ని వమ్ము చేస్తూ, భారీగా జనం పోలింగ్ కేంద్రాలకు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తాము చేసిన ప్రచారం ఓటర్లను పోలింగ్ బూతుల వద్ద బారులు తీరేలా చేస్తుందని చెబుతున్నారు.

వైసీపీ నేతలు అంచనా వేసినట్టుగానే ప్రస్తుతానికైతే జనం బాగానే కనిపిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా, 279 పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ పర్సంటేజీపై ఓ అంచనాకు రావొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?