Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎమ్మెల్సీ వద్దు... ఎమ్మెల్యే టికెట్ కావాలి!

ఎమ్మెల్సీ  వద్దు... ఎమ్మెల్యే టికెట్ కావాలి!

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తన అనుచరులు అభిమానులతో సమావేశం అయిన అనంతరం టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ విలువలు ఉన్న వారిని పక్కన పెట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

తమకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఏ నామినేటెడ్ పదవులు వద్దని ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యలు చెప్పినా ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు పరిష్కరించలేకపోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధినాయకత్వం సరైన నిర్ణయం తీసుకుని శ్రీకాకుళంలో పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కోరారు. శ్రీకాకుళం టీడీపీలో చోటు చేసుకున్న విభేదాలు గందరగోళ పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత హై కమాండ్ దే అని అన్నారు. తనకు వ్యక్తిగత అజెండా లేదని క్యాడర్ ఎలా చెబితే అలాగే అని గుండా కొత్త సంకేతాలు ఇచ్చారు.

రానున్న రోజులలో హై కమాండ్ టిక్ట్ ని గుండ ఫ్యామిలీకి ఇవ్వకపోతే కనుక ఆయనతో పాటు సతీమణి గుండ లక్ష్మీదేవి ఎంపీ ఎమ్మెల్యేలుగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో శ్రీకాకుళం రాజకీయాలలో కొత్త చిచ్చు మొదలైంది. ఈ విషయంలో హై కమాండ్ ఏమి చేస్తుందో అన్న ఆసక్తి అంతటా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?