Advertisement

Advertisement


Home > Politics - Andhra

దారుణంగా ట్రోలింగ్.. అట్లుంటది జగన్ తోని!

దారుణంగా ట్రోలింగ్.. అట్లుంటది జగన్ తోని!

జగన్ వైఖరి చూస్తే.. పెద్దగా టీజింగ్ చేసేలా కనిపించరు. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఆయనలో రెండో మనిషి బయటకొస్తుంటారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ విషయంలో జగన్ ఎందుకో తన ఒరిజినాలిటీ పక్కనపెట్టి మరీ విరుచుకుపడిపోతున్నారు. 

ఇటీవల పవన్ కల్యాణ్ పదే పదే తనని దత్త పుత్రుడు అనొద్దని మొత్తుకున్నారు. కానీ వైసీపీ వాళ్లు వినడం లేదు. దీంతో జగన్ ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని కూడా పవన్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడైనా తగ్గుతారనుకున్నారేమో కానీ, రెట్టింపు స్థాయిలో జగన్ విరుచుకుపడిపోతున్నారు. 

ఈరోజు మత్స్యకార భరోసా కార్యక్రమంలో పదే పదే దత్తపుత్రుడి ప్రస్తావన వచ్చింది. రెండుచోట్లా పోటీ చేసి ఓడిపోయిన దత్తపుత్రుడంటూ మరింత సెటైరిక్ గా మాట్లాడారు జగన్.

కెలికి మరీ తిట్టించుకోవడమంటే ఇదే..

వైసీపీ వాళ్లు దత్తపుత్రుడు అని ఒకటిరెండుసార్లు అనుండొచ్చు. ఆ మాత్రానికే నన్ను అలా అనొద్దు, ఇలా అనొద్దు, అలా టీజ్ చేయొద్దు అంటూ గింజుకుంటే ఎలా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ మాత్రం 'మర్యాదలు' అందరికీ ఉంటాయి. పవన్ మాత్రం తాను అందరిపై రాళ్లు  వేస్తాను, తనపై ఎవరూ వెయ్యకూడదనుకునే టైపు. అందుకే గింజుకున్నారు. 

ఇప్పుడేమైంది.. దత్తపుత్రుడనే పేరు స్థిరపడిపోయేలా ఉంది. అలా స్థిరపడిపోయేలా చేసుకున్నారు పవన్. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఇదే పదాన్ని వాడుతున్నారంటే అర్థం చేసుకోండి.. పవన్ కల్యాణ్ ని ఏ స్థాయిలో జగన్ ఏడిపిస్తున్నారో..?

జగన్ పై, జగన్ పాలనపై సినిమాల్లోనూ, సినిమా ఫంక్షన్లలోనూ పరోక్షంగా డైలాగులు రాయించి తమాషా చూస్తుంటారు పవన్ కల్యాణ్. ఆ మాత్రం డైలాగులు రియల్ లైఫ్ లో ఎదురొస్తే ఎందుకంత నొప్పి. చంద్రబాబు కోసం లోకేష్ కూడా ఆ స్థాయిలో పాకులాడరు, పవన్ అంతకంటే ఎక్కువ అన్నట్టుగా బాబు గురించి ఆలోచిస్తుంటే ఆయన్ను దత్తపుత్రుడు కాకుండా ఇంకేమనాలి.

మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన సొంత పుత్రుడు, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దత్తపుత్రుడిని నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఇలాంటి వారిని కాదు నమ్ముకోవాల్సింది జనాల్ని నమ్ముకోవాలి, ప్రజల కోసం రాజకీయం చేయాలంటూ హితవు పలికారు. 

జగన్ టార్గెట్ చంద్రబాబే అయినా.. మధ్యలో ఆయన పల్లకీ మోస్తున్నందుకు పవన్ పై కూడా జగన్ బాగానే 'అక్షింతలు' వేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?