Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ కౌంటర్లకు వేళాయె..?

జగన్ కౌంటర్లకు వేళాయె..?

గతంలో లాగా జగన్ కేవలం పథకాలతోనే సరిపెట్టడం లేదు. వాటితోపాటు ప్రతిపక్షాలకు పద్ధతిగా తలంటుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ఆగడాలను చీల్చి చెండాడుతున్నారు, దుర్మార్గాలను ఎండగడుతున్నారు, అభివృద్ధికి ఎలా అడ్డుగా నిలబడుతున్నారో ప్రజలకు వివరించి చెబుతున్నారు, అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. 

గతంలో సంక్షేమ కార్యక్రమాల కోసం పెట్టిన బహిరంగ సభల్లో అస్సలు రాజకీయాలు మాట్లాడేవారు కాదు జగన్. కానీ ఇప్పుడు తప్పనిసరి అవుతోంది.

మీట నొక్కడంతో పాటు, ప్రతిపక్షం పీక నొక్కడం కూడా పనిగా పెట్టుకున్నారు. ఈరోజు మరోసారి అలాంటి కార్యక్రమం జరిగేలా ఉంది. సత్యసాయి జిల్లాలో చెన్నే కొత్తపల్లిలో పంట బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలోనే జగన్, మరోసారి చంద్రబాబు, లోకేష్ కు చాకిరేవు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఎందుకంటే, ఈమధ్య కాలంలో వీళ్లిద్దరూ చేస్తున్న అసత్య ప్రచారాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.

పదో తరగతి ఫలితాల రాద్ధాంతంపై కౌంటర్ ఉంటుందా..?

పదో తరగతి ఫలితాలపై ఇటీవల ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఫలితాలు తక్కువగా వచ్చినందుకు ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి ప్రతిపక్షాలు. అంతే కాదు, ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూడా నిందలేశాయి. 

గ్రేస్ మార్కులంటూ ఒకరు, జూమ్ మీటింగ్ లంటూ మరొకరు.. నానా హంగామా చేశారు. వీటన్నిటీకీ వైసీపీ మంత్రులు ఈపాటికే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడిక సీఎం వంతు వచ్చింది. జగన్ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో, ఎంతలా సీరియస్ అవుతారో చూడాల్సి ఉంది.

దత్తపుత్రుడి కోటా కూడా ఉంటుందా..?

ఇటీవల తన విమర్శల కోటాలో చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కి కూడా సమానంగా వాటా ఇస్తున్నారు జగన్. దత్తపుత్రుడంటూ పదే పదే ర్యాగింగ్ చేస్తున్నారు. ఈసారి కూడా పవన్ కల్యాణ్ వాటా ఉంటుందా, గ్రేస్ మార్క్ ల గోలపై పవన్ ని ఉతికి ఆరేస్తారేమో చూడాలి. 

ఈరోజు కార్యక్రమం రైతుల ఖాతాల్లో పంట బీమా సొమ్ము జమచేయడం కాబట్టి.. కౌలు రైతుల భరోసా అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ కి ఓ రేంజ్ లోనే కౌంటర్లు పడే అవకాశముంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?