Advertisement

Advertisement


Home > Politics - Andhra

సంపూర్ణ మద్య నిషేధం అని టీడీపీ చెప్పగలదా?

సంపూర్ణ మద్య నిషేధం అని టీడీపీ చెప్పగలదా?

తెలుగుదేశం పార్టీ ఒంటరిగా రావడం లేదు, కూటమిగా వస్తోంది. జనసేన బీజేపీలను తన వైపు తిప్పుకుంది. ఇతర పార్టీలతో లోపాయికారీ అవగాహన ఉందని వైసీపీ అంటుంది. ఇది చాలదు అన్నట్లుగా లోక్ సత్తా కూడా మద్దతు ఇచ్చింది.

లోక్ సత్తా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీ గెలవాలని కోరుకుంటోంది. జగన్ సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేయలేదని లోక్ సత్తా నేతలు విమర్శిస్తున్నారు. లోక్ సత్తా మద్య పాన నిషేధానికి మద్దతుగా ఉంటే జగన్ చేయలేని పనిని టీడీపీ కూటమితో చేయించవచ్చు కదా అని అడుగుతున్నారు అంతా.

ఏపీ యువత అంతా మద్యానికి బానిస అయిపోయారు అని అంటున్న లోక్ సత్తా నేతలు టీడీపీ నాణ్యమైన మద్యం ఇస్తామంటే ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కూటమికి మద్దతు ఇస్తూ వారి గెలుపును మనసారా కోరుకుంటున్న లోక్ సత్తా నేతలు ఏపీలో మద్య పాన నిషేధం చేయమని కూటమిని గట్టిగా అడగవచ్చు కదా అన్న సూచనలు వస్తున్నాయి.

మరో అయిదేళ్ల పాటు ప్రజలు కొత్త ప్రభుత్వానికి అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వబోతున్నారు. ఏపీలో మద్య పాన నిషేధం జరిగితే మంచిదే. అది ఆదాయ వనరుగా చూడడాన్ని ఎవరూ సమర్ధించరు. వైసీపీ అయినా టీడీపీ అయినా మరో పార్టీ అయినా మద్యపాన రహిత ఏపీ అంటే మంచిదే. అలాగే మద్య పాన రహితంగా రాష్ట్రం బాగుండాలని కోరుకునే మేధావులు కానీ లోక్ సత్తా నేతలు కానీ ఒక వైపే చూడకుండా ఈ విషయంలో టీడీపీ కూటమిని కూడా డిమాండ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?