Advertisement

Advertisement


Home > Politics - Andhra

కూటమికి చాలా రిపేర్లు చేయాలి బాబూ!

కూటమికి చాలా రిపేర్లు చేయాలి బాబూ!

ఉత్తరాంధ్ర పర్యటనను పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో కూటమి నత్త నడక నడుస్తోంది. అభ్యర్ధులను ప్రకటించిన తరువాత చాలా చోట్ల స్తబ్దత ఆవరించింది. గతానికి భిన్నంగా జనసేన బీజేపీలకు తొమ్మిది అసెంబ్లీ సీటు రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం తో తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు.

ఆ సీట్లు కూడా టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. దాంతో కూటమి అసంతృప్తి కొలిమిలో సలసల కాగుతోంది. సీనియర్ల నుంచి జూనియర్ నేతల వరకూ అంతా తెలియని వేదనతో ఉన్నారు. ఆశించిన సీట్లు రాక కొందరికి సీట్లు లేక మరి కొందరికి కంపల్సరీ రిటైర్మెంట్ తో టీడీపీ లో కకావికలంగా ఉంది.

తాంబూలాలు ఇచ్చేసాం అన్నట్లుగా మిత్ర పార్టీలకు పొత్తు సీట్లు ఇచ్చేసి అభ్యర్ధులను ప్రకటించేసి ఆనక అంతా సర్దుకుంటాయని కూటమి పెద్దలు అనుకుంటే దానికి రివర్స్ గా రోజుల తరబడి టీవీ సీరియల్ మాదిరిగా తమ్ముళ్ళ నిరసనలు సాగుతున్నాయి.

నామినేషన్లకు గడువు దగ్గర పడడంతో మంచి ముహూర్తం చూసుకుని రెబెల్స్ గా రంగంలోకి దిగాలని చాలా మంది చూస్తున్నారు. కో ఆర్డినేషన్ అన్నది మూడు పార్టీల మధ్య మిస్ అయి కూటమి ప్రచారం జోరు అందుకోలేదు దాంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా చాలా నియోజకవర్గలాలో ఉంది.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు ఈ నెల 14న విశాఖ వస్తున్నారు. ఆయన ఈ నెల 17 దాకా ఉత్తరాంధ్ర పర్యటనలు చేస్తారు. అంటే నాలుగు రోజుల పాటు ఉంటారు అన్న మాట. చంద్రబాబు కూటమికి రిపేర్లు చేసి పరుగులు తీయించకపోతే ఇక ఇబ్బందులే అంటున్నారు. ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా అలకలు తీర్చి తమ్ముళ్లను ఎన్నికల యుధ్దానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అయితే అధినాయకత్వం ఇచ్చే హామీలను పుచ్చుకుని ఎంతమంది దారికి వస్తారు అన్నది సందేహంగానే ఉంది అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?