Advertisement

Advertisement


Home > Politics - Andhra

నారాయణకు ఎక్కింది.. చంద్రబాబుకు ఎక్కుతుందో లేదో?

నారాయణకు ఎక్కింది.. చంద్రబాబుకు ఎక్కుతుందో లేదో?

పవన్ కల్యాణ్ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? నాదెండ్ల మనోహర్ చాలా చురుగ్గా రాష్ట్రమంతా ఈ మూలనుంచి ఆ మూల వరకు తిరుగుతున్నారు బాగానే ఉంది. మరి జనసేనాని ఏం చేస్తున్నారు? నాదెండ్ల మనోహర్ టూర్ ప్రోగ్రాం ను పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు. అంతా తన సూచనల మేరకే నాదెండ్ల తిరుగుతున్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు గానీ.. పార్టీ అధికార ప్రతినిధిలాగా ఆయన సంగతులు వెల్లడిస్తున్నారు తప్ప.. సారథిలాగా వ్యవహరించడం లేదు. మరేంచేస్తున్నారు? ఇంత సైలెంట్ గా ఎందుకున్నారు?

పవన్ కల్యాణ్ సైలెంట్ గా ఎందుకున్నారో.. సీనియర్ నేత సీపీఐ నారాయణకు అర్థమైంది. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిన్నకుండిపోయారని సీపీఐ నారాయణ తన అబ్జర్వేషన్ ను బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని కూడా ప్రశ్నించారు. 

నారాయణ మాటలను గమనిస్తే.. ఈ భేటీలో నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ కు తలంటు పోసినట్టుగానే కనిపిస్తోంది. చంద్రబాబుతో పొత్తు బంధం కుదుర్చుకోవడం గురించి పదేపదే తనంత తాను మాట్లాడుకుంటూ ఉండడం. తద్వారా బిజెపి మీద పొత్తుకోసం చుతున్న తరహాలో నర్మగర్భంగా మాట్లాడడం అనేది సరైన రాజకీయ చతురత కాదని.. చీప్ ట్రిక్స్ మిగులుతాయని బహుశా నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ కు చెప్పి ఉండాలి. ఆ భేటీ తర్వాత.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా.. ఒకేసారి ఐక్యంగా ఉంటాం అని అన్న పవన్ కల్యాణ్.. తర్వాత, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జనసేన పార్టీ అస్తిత్వం కనీసం వార్తల్లో కనిపిస్తోందంటే.. అది కేవలం నాదెండ్ల మనోహర్ పర్యటనల రూపంలోనే. మరి నరేంద్రమోడీ - పవన్ తో ఇంతకంటె సీరియస్ విషయాలు ఇంకేమైనా చర్చించారా అనే సందేహాలు కూడా పుట్టేలా ఈ పరిణామాలు ఉన్నాయి. 

మొత్తానికి పవన్ కల్యాణ్ ను మోడీ సైలెంట్ గా మార్చేశారనే సంగతి... సీపీఐ నారాయణ గుర్తించారు. కానీ ఫార్టీఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఇంకా ఆ సంగతిని గుర్తించినట్టుగా లేదు. లేక, గుర్తించి కూడా.. గుర్తించనట్టుగా నటిస్తున్నారో ఏమో మనకు తెలియదు. తనకు ప్రతికూలమైన పరిణామం గనుక.. దానిని గుర్తించినా తనకే నష్టమనే ఉద్దేశంతో చంద్రబాబు ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?