Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఈ నిబంధనలపై నోరెత్తితే.. అది ధూర్త రాజకీయం!

ఈ నిబంధనలపై నోరెత్తితే.. అది ధూర్త రాజకీయం!

పాదయాత్ర చేయడం కోసం అనుమతులు అడిగారు... అనుమతి ఇచ్చేవరకు ఆగలేకపోయారు. నానా యాగీ ప్రారంభించారు. తమను వేధిస్తున్నారని అన్నారు.. మీరు అడుగుతున్నన్ని వివరాలు చరిత్రలో ఎవ్వరూ అడగలేదని రంకెలు వేశారు.. భద్రత కోసం ముందుజాగ్రత్తగా అడుగుతున్న వివరాల్ని కూడా భూతద్దంలో చూపించి అందులో కూడా పొలిటికల్ మైలేజీ పిండుకునే కుయత్నాలుకు పాల్పడ్డారు.. ప్రతిపక్షాల గళం నొక్కేస్తున్నారని అన్నారు.. పాదయాత్ర చేస్తున్నారంటేనే ప్రభుత్వం భయపడుతోందనీ అన్నారు.. ఇలా రకరకాల కారుకూతలు కూశారు. 

చివరికి నారా లోకేష్ చేయదలచుకున్న పాదయాత్ర యువగళం కార్యక్రమానికి అనుమతి వచ్చేసింది. ఇక ఆయన నడవడం ఒక్కటే తరువాయి. అనుమతులు రాగానే.. ఈ నాలుగైదు రోజుల పాటు పచ్చనాయకులు, పచ్చ మీడియా చేసిన అర్థంపర్థంలేని దుష్ప్రచారాలన్నీ గాలిలో కొట్టుకుపోయాయి. కానీ ఈలోగా ప్రజల మెదళ్లలో పచ్చదళాలు నింపిన ప్రభుత్వ వ్యతిరేక విషబీజాలు మాత్రం మిగిలిపోయాయి. వారికి కావాల్సింది కూడా అదే. 

మొత్తానికి పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని నిబంధనలు విధించారు. ఈ నిబంధనల మీద కూడా ఎవరైనా నోరెత్తి విమర్శలు చేశారంటే.. అంతకంటె ధూర్త రాజకీయం మరొకటి ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే.. పోలీసులు విదించిన నిబంధనలు అన్నీ కూడా.. అటు పాదయాత్ర చేస్తున్న నాయకుడి భద్రత, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని విధించిన నిబంధనలు. అలాంటి నిబంధనలతో ముందుగా హెచ్చరించకపోతేనే పోలీసులు తీరును తప్పుపట్టాలి. వారు చాలా పద్ధతిగా నిబంధనలు పెట్టారు. 

పాదయాత్ర వెంట ఓ అంబులెన్సును ఉంచుకోవాలని, అగ్నిమాపక యంత్రాన్ని కూడా అందుబాటులో చూసుకోవాలని పోలీసులు నిబంధనల్లో పేర్కొన్నారు. జనం ఎక్కడ కనిపిస్తే అక్కడ మైకు పట్టుకుని మాట్లాడేస్తూ రోడ్లను స్తంభింపజేయడం కుదరదని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రెవేటు ఆస్తులకు నష్టం కలిగించకుండా యాత్ర సాగాలని పేర్కొన్నారు. నిజానికి పోలీసులు పెట్టిన నిబంధనలన్నీ యాత్ర సజావుగా, నిరాటంకంగా, ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా సాగడం కోసం మాత్రమే. ఈ నిబంధనలను కూడా ఎవరైనా విమర్శిస్తే గనుక.. అంతకు మించిన వక్రబుద్ధులు వేరే ఉండవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?