Advertisement

Advertisement


Home > Politics - Andhra

కులాల పేరుతో పవన్ లేకి మాటలు!

కులాల పేరుతో పవన్ లేకి మాటలు!

పవన్ కల్యాణ్ కు రాజకీయంగా పరిణతి లేకపోవడం వింతేమీ కాదు. రాజకీయం, ప్రజాజీవితం గురించి షూటింగ్ గ్యాప్ లలో మాత్రమే ఏసీ గదుల్లోంచి అడుగు బయటపెట్టే ఈ నాయకుడికి తెలుస్తుందనుకోవడం భ్రమ. కాబట్టి రాజకీయ  పరిణతి సంగతి వదిలేద్దాం. కనీసం వ్యక్తిగా అయినా పరిణతి ఉన్నదా? అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. కులాల పేర్లతో ఆయన ఎంత చీప్ మాటలు మాట్లాడుతున్నారంటే.. అసలు ఆయనకు సమాజం గురించిన, మనుషుల గురించిన ఎంతటి లేకి అభిప్రాయాలు ఉన్నాయో కదా అనే అభిప్రాయమూ కలుగుతుంది. 

మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన తూర్పుకాపులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడినుంచి ప్రసంగం మొత్తం కులం వాసన. తూర్పు కాపుల నుంచి ఒక మంత్రి ఉన్నాడు, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. అయినా సరే వారికేమీ న్యాయం జరగడంలేదు అని ఏడుపు. అయితే పవన్ ఉద్దేశం ఏంటో అర్థం కాదు. బొత్స సత్యనారాయణ తూర్పు కాపు అయితే.. ఆయన రాష్ట్రంలో ఉన్న తూర్పుకాపులందరి బాగుకోసం మాత్రమే పనిచేయాలా? మిగిలిన కులాల వాళ్లను గాలికి వదిలేయాలా? ఎలాంటి ఉద్దేశంతో పవన్ ఇలాంటి లేకి మాటలు మాట్లాడుతున్నారో తెలియదు. 

ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేసేటప్పుడు ఉమ్మడి ప్రజాప్రయోజనాన్ని కాంక్షిస్తుంది. కులాల ప్రాతిపదికను కూడా పరిగణిస్తుంది. కులాలవారీగా ఇతరత్రా పథకాలు ఉంటాయి. ఆయా కులాల స్థాయిని బట్టి అవి ఉంటాయి. ఆ విషయంలో అన్ని కులాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

అంతే తప్ప ఏ కులం వాళ్లు అధికారంలో కీలకంగా ఉంటే ఆ కులం తప్ప మరెవ్వరూ బాగుపడకూడదు. ఆ కులాన్ని పూర్తిగా ఉద్ధరించేయాలి అన్నట్టుగా పవన్ మాటలు ఉన్నాయి. నన్ను అధికారంలోకి తెస్తే.. అన్ని విస్మరించిన కులాలకు అధికారం రుచి చూపిస్తా అంటున్న కల్యాణ్ ఏం చేస్తారో అర్థం కావడంలేదు. కులం గణాంకాల ఆధారంగా సీఎం పదవిని ఆ దామాషాలో రోజుల వంతున అన్ని కులాలకు పంచి అన్నికులాలనూ ముఖ్యమంత్రులను చేసిన ఏకైక నాయకుడిని నేను అని చెప్పుకుంటారా? ఇంత చీప్ గా అసలు పవన్ ఎలా మాట్లాడగలరు?

తెలంగాణలో పవన్ కు ఠికానా లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట అనాలంటే.. ధైర్యంలేదు. ఒళ్లంతా అణువణువునా భయం. అందుకే అక్కడ రాజకీయాన్ని కూడా లౌక్యంగా నడిపిస్తారు. పార్టీ కేడర్ ను వాడుకుంటారు. వారు ఎన్నికలకు తయారైతే ప్రోత్సహించరు. అక్కడ తూర్పుకాపులంతా వచ్చి తమను బీసీల జాబితాలోంచి తీసేసారని ఆయనతో మొరపెట్టుకున్నారట. అధికారంలో ఉంటే ఏమైనా చేయగలం.. లేపోతే ఏం చేయగలం.. అప్పీల్ తప్ప! అని ఈ హీరోగారు సెలవిస్తున్నారు. 

అధికారం లేదు గనుక.. అప్పీల్ తప్ప మరేమీ చేయలేని నాయకుడు.. తాను న్యాయం అనుకున్నదానికోసం, అన్యాయం జరిగిందని తాను నమ్మిన ప్రజలకోసం పోరాటం చేయలేని వాడు అసలు నాయకుడిగా ఎలా చెలామణీ అవుతాడు? ఎందుకు పనికొస్తాడు? అని ప్రజలు అనుకుంటున్నారు. అధికారంలో లేదు నేనేం చేయగలను.. అనే వ్యక్తి ఏ క్షణా అయినా.. రాజకీయాలను దులుపుకుని వెళ్లిపోయే బాపతే అనేది అందరినోళ్లలో వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?