Advertisement

Advertisement


Home > Politics - Andhra

డ్రామా అనేవాళ్లకు బుర్రలేదు సరే, సిగ్గుండాలి కదా!

డ్రామా అనేవాళ్లకు బుర్రలేదు సరే, సిగ్గుండాలి కదా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగింది. సహజంగానే ఈ దాడిని తెలుగుదేశం పార్టీ వారు చేయించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అభిమాని ఎవడో ఒకడు జగన్ మీద ద్వేషంతో రాయి తీసుకుని విసిరి ఉంటాడనే అభిప్రాయమే వినిపిస్తోంది. ముందు రాయి విసిరిన వ్యక్తి దొరకాలి. ఆ తర్వాత వాడి వెనుక ఎవరున్నారు? ఈ దాడి ఎవరు చేయించారు? అనేది తేలుతుంది.

రెండో అంశం ఏంటంటే- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి విషయంలో భద్రత వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. ఆ విషయాన్ని పోలీసులు అంగీకరించి తీరాలి. అంగీకరించి, తమ పరువు కాపాడుకోవడానికి, సత్వరమే అసలు ఈ దుర్మార్గానికి పాల్పడింది ఎవరో వారు తేల్చాలి. శిక్షించాలి.

ఇక అసలు విషయానికి వద్దాం- జగన్ కు గాయం కావడం అనేది ఒక డ్రామా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకబిగిన గొంతెత్తి అరుస్తున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కడూ కాస్త తెలివిగా ఈ మాట అనకుండా జాగ్రత్త పడ్డారు గానీ.. తనకు బుర్రలేదని అనేక సందర్భాల్లో నిరూపించుకునే అచ్చెన్నాయుడు దగ్గరినుంచి, తాను అతిపెద్ద బుర్ర ఉన్న మేధావినని విర్రవీగుతూ ఉండే పయ్యావుల కేశవ్ వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వంగలపూడి అనిత, వర్ల రామయ్య వంటి అనేక మంది ఈ గాయాన్ని ఒక డ్రామాగా అభివర్ణిస్తున్నారు. ఇదంతా కోడికత్తి డ్రామా 2.0 అంటున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఇంకా టూమచ్. ఈ గాయం ప్రమాదవశాత్తూ జరిగినట్టుగా ఆమె భావించడం పెద్ద కామెడీ.

అయితే దీనిని డ్రామాగా అభివర్ణిస్తున్న వారిలో ఒక్కరికి కూడా బుర్రలేదనే సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే.. డ్రామా కింద సానుభూతి కోసం చేయాలనుకుంటే.. ఆ దాడిని నిరపాయకరమైన శరీర భాగాలపై రాళ్లు విసిరేయించుకుని ఉండేవారు. అలా కాకుండా రాయి వచ్చి సూటిగా తలకే తగిలింది.

నిజం చెప్పాలంటే జగన్ అదృష్టం చాలా బాగుంది. రాయి కొద్దిగా కిందకు తగిలిఉంటే ఎడమ కన్నుపోయేది. గట్టి ఎముకభాగం ఉండే నుదుటిమీద తగలడం వలన రెండుకుట్లు పడేంత చిన్న గాయం అయింది గానీ.. సున్నితమైన కన్నుభాగంలో అదే రాయి తగిలి ఉంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద ప్రమాదం కింద లెక్క. అదే మాదిరిగా ఆ రాయి కొంచెం పక్కకు అంటే కణత మీద తగిలిఉంటే గనుక.. ప్రాణాపాయం అయినా ఆశ్చర్యం లేదు.

సానుభూతి కోసం దాడి చేయించుకునే వాళ్లు కన్నుపోయేలా, ప్రాణం పోయేలా దాడి చేయించుకుంటారా? ఈ మాత్రం ఆలోచించలేకుండా డ్రామాగా అభివర్ణించే వాళ్లకు బుర్రలేదని అందరికీ తెలుసు. కనీసం ఇలాంటి దాడి సమయంలో ఇలాంటి విమర్శ చేయడానికి వారికి సిగ్గుండాలి కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

ఏ పార్టీ వాడైనా సరే.. రాయివిసిరినది ఎవరో పోలీసులు కనిపెట్టి శిక్షించాలి అని డిమాండ్ చేయాలి.. అలా కాకుండా.. డ్రామా అనడం అంటే ఆ నాయకుల సిగ్గులేని తనానికి నిదర్శనం అని ప్రజలు విమర్శిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?