Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖ‌ పోర్టు వంతు...వరసబెట్టి మరీ...

విశాఖ‌ పోర్టు వంతు...వరసబెట్టి మరీ...

కేంద్రం దూకుడు చేస్తోంది. ప్రగతి విషయంలో అయితే ఏమో కానీ అమ్మకానికి మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను సిద్ధం చేస్తోంది. భారీ సంపదను తెచ్చి ప్రైవేటుకు దారాదత్తం చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఎందరు ఎంతలా ఉద్యమించినా తన పని తనదే అని బేఖాతర్ చేస్తూ ముందుకు పోతున్న కేంద్రం ఇపుడు విశాఖ పోర్టు మీద కన్నేసింది అంటున్నారు.

విశాఖ పోర్టులోని బెర్తులను విడివిడిగా ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం అయిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అదే విధంగా విశాఖలో పోర్టుకు ఖరీదైన స్థలాలు ఉన్నాయి. అలాగే స్టేడియాలు ఉన్నాయి. ఆసుపత్రులు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ ప్రైవేట్ కంపెనీలకు లీజుల పేరిట దారాదత్తం చేయడానికి కేంద్రం పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసింది అని కార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.

పైగా వీటిని కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనుకోవడంతో జనాల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతోంది. విశాఖలోని పోర్టు ఆసుపత్రి ఉచిత సేవలను అందిస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఇపుడు ఆసుపత్రిని పీపీపీ పద్ధతి మీద ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనుకోవడంతో అంతా ఆగ్రహిస్తున్నారు. పోర్టు ఆసుపత్రి ప్రైవేట్ పరం చేస్తే కార్మికులు వారి కుటుంబాలకు వైద్యం అందేదెలా అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా ప్రైవేటుకు ఇవ్వడం తాకట్టు పెట్టడం అమ్మడం లీజుకు ఇవ్వడం వంటివి కేంద్రం చేస్తూ విశాఖ సంపదను మొత్తం ప్రైవేట్ పరం చేయడాన్ని అంతా నిరసిస్తున్నారు. అయినా అక్కడ ఉన్నది మోడీ సర్కార్. ఈ విషయంలో వెనక్కి తగ్గే చాన్స్ అయితే ఉంటుందా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?