Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఉత్తరం బీజేపీకి చిక్కుతుందా?

ఉత్తరం బీజేపీకి చిక్కుతుందా?

విశాఖ ఉత్తరం సీటుని పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఉత్తరం నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన 2014లో పొత్తు ఫలాన్ని పొందారు. గెలిచారు. 2019లో విడిగా పోటీ చేయడంతో ఓటమి పాలు అయ్యారు.

టీడీపీ పొత్తు కోసం ఆరాటపడిన బీజేపీ నాయకులలో ఆయన కూడా ముందు వరసలో ఉన్నారు. అయితే 2014 నాటి పరిస్థితి 2024లో ఉందా అన్నది ఇపుడు అంతా తర్కించుకుంటున్నారు. కేకే రాజు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన 2019లో స్వల్ప తేడాతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద ఓడిపోయారు.

గత అయిదేళ్లుగా ఆయనే అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పార్టీని జనంలో ఉంచుతూ అంతటా పర్యటిస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. దాంతో ఈసారి ఆయన విజయం ఖాయమని వైసీపీ ధీమాగా ఉంది.

రాజు విషయానికి వస్తే ఆయనకు టీడీపీ నుంచి ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. ఈ సీటు మీద టీడీపీ ఆశావహులు కూడా కర్చీఫ్ వేశారు కానీ దక్కలేదు అన్న బాధ ఉంది. ఉత్తరం నుంచి ఒక మహిళా నేత జనసేన టికెట్ కోసం ప్రయత్నం చేశారు. దాంతో ఆ పార్టీలో కూడా అసంతృప్తి ఉందని అంటున్నారు.

ఈ సీటులో అనూహ్యంగా జేడీ లక్ష్మీనారాయణ పోటీకి దిగిపోయారు. ఆయన కొత్తగా స్థాపించిన జై నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. లక్ష్మీనారాయణ మొదట  విశాఖ ఎంపీగా పోటీ అని చెప్పినా చివరికి ఎమ్మెల్యేగానే అంటున్నారు.

విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేయడం వెనక సామాజిక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు. ఈ సీటులో కాపులు ఎక్కువ. దాంతో అదే సామాజిక వర్గానికి చెదిన లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగానే ఈ సీటుని ఎంచుకున్నారని అంటున్నారు.

ఆయన పోటీ వల్ల బీజేపీ వైసీపీలలో ఎవరికి ముప్పు అంటే బీజేపీకే అని అంటున్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీకి వెళ్ళాల్సిన ఓట్లే జేడీకి వెళ్తాయని తమ విజయం మరింత సునాయాసం అవుతుందని కేకే రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ టీడీపీ పొత్తు కుదరాలని తపించి టికెట్ దక్కించుకున్న రాజు గారు మరోసారి ఎమ్మెల్యే అవుతారా అంటే ఈ పోరు ఆసక్తికరం అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?