Advertisement

Advertisement


Home > Politics - Andhra

విషం కక్కడం సరే.. ఇంత నీచంగానా?

విషం కక్కడం సరే.. ఇంత నీచంగానా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జయహో బీసీ సభ విజయవంతం అయ్యేసరికి పచ్చదళాలు ఓర్చుకోలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసిన మేలును తెలియజెప్పింది. ఏ రకంగా బీసీల అభ్యున్నతికి తాను కట్టుబడి ఉన్నానో జగన్ చాలా విపులంగా వివరించారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఈ సభ విజయవంతం కావడం చూసి పచ్చదళాలు ఓర్చుకోలేకపోతున్నాయి. విషం కక్కుతున్నాయి. 

మంత్రి పదవులు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. తన మంత్రి వర్గంలో 70 శాతం మంత్రి పదవుల్ని బీసీలకు ఇచ్చానని జగన్ మోహన్ రెడ్డి సాధికారంగా చెబితే.. ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. మంత్రి పదవులు ఇస్తున్నారు గానీ.. అధికారాలు ఇవ్వడం లేదని ఆరోపణలు. 

సీనియర్లయినా సొంతంగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నదంటూ నిందలు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ఎంతగా పెద్ద పీట వేశామో జగన్ తన ప్రసంగంలో వివరించగా.. దాని మీద కూడా విషం కక్కే పనులు చేస్తున్నారు. పదువులు ఇచ్చారు గానీ.. నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. నిధులు అనేవి కేవలం బీసీల నాయకత్వంలో ఉన్న స్థానిక సంస్థలకు మాత్రమే ఇవ్వడం లేదా అనేది ప్రజలకు కలుగుతున్న ప్రశ్న. నిధుల లభ్యతను బట్టి విడుదల అవుతుంటాయి. దానిని కూడా బీసీలకు చేస్తున్న ద్రోహంలాగా ప్రచారం చేస్తే.. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. 

వైసీపీ జయహో బీసీ సభ నిర్వహించడానికి పూనుకోగానే.. తెలుగుదేశం పార్టీ తొందరపడింది. ముందుగానే ఒక బీసీసభను నిర్వహించింది. బీసీలకు అన్యాయం జరుగుతున్నదంటూ రకరకాల ఆరోపణలు గుప్పించింది. నిందలు వేసింది. నిజానికి తెలుగుదేశం ముందుగా నిర్వహించిన బీసీసభ వైసీపీకి మేలే చేసింది. జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం మీద వేస్తున్న అన్ని రకాల నిందలకు జవాబిచ్చారు. నిజం చెప్పాలంటే.. నిందలు వేసిన వాళ్లు నోరెత్తలేని పరిస్థితిని సృష్టించారు. ఇక పచ్చదళం రెచ్చిపోతోంది. పచ్చమీడియా కారుకూతలు కూస్తోంది. అవాకులు చెవాకులు వండి వారుస్తోంది. 

మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని ఏడుస్తున్న వారు ఆ మాట ఎలా చెప్పగలరు? ఆ శాఖలో వస్తున్న నిర్ణయాలన్నీ వారు తీసుకుంటున్నవి కాదని ఎలా అనగలరు. బురద చల్లేసి ఊరుకుంటే.. అవతలి వాళ్లు కడుక్కుంటారులే అన్న చందంగా వీరి ధోరణి ఉంది తప్ప.. నిజాయితీగా బీసీలకు ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపం ఏమైనా ఉంటే.. నిర్మాణాత్మకంగా ఎత్తిచూపుదామనే సంయమనం లేదు. 

పచ్చపార్టీ గానీ, పచ్చ దళాలు గానీ, పచ్చ మీడియా గానీ.. ప్రభుత్వం మీద విషం కక్కడం అనేది తొలినుంచి జరుగుతున్నదే. కానీ.. జయహో బీసీ సభ విజయవంతం కాగానే దాన్ని చూసి ఓర్వలేక తక్షణం ప్రారంభించిన విషప్రచారం మరీ నీచంగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?