తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నీళ్ల విషయంలో గతంలో తెలంగాణ పడిన గోసకు విరుగుడుగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.
వేలకోట్ల నిధులను ఈ ప్రాజెక్టు విషయంలో ఖర్చు చేయడంతోపాటు అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలు కలిగిన మేఘా లాంటి సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు మేఘా శక్తి సామర్థ్యాలు తోడవడంతో అనతికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ప్రస్తుతం నీటి పంపింగ్ విషయంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డులను నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా చాటుతోంది.
ఔరా అనిపిస్తున్న రికార్డులు..
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి పంపింగ్ విషయంలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనతికాలంలోనే వందల టీఎంసీ నీటిని ఎత్తిపోస్తుంది. ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి100 టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తిపోసింది. లింక్ -1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టిఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి.. సుందిళ్ల పార్వతి.. లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టిఎంసీల చొప్పున పంపింగ్ ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
నీటి పంపింగ్ లో ‘మేఘా’ సరికొత్త రికార్డు..
కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ ను మేఘా పూర్తి చేయడమే కాకుండా అనతికాలంలోనే వందల టిఎంసీల నీటిని పంపింగ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ ను 2019 జూలై 6న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు ప్రారంభించారు. నాటి నుంచి 522 రోజులపాటు పని చేసి దాదాపు 100 టిఎంసీల నీటిని పంప్ చేసింది. ఈ పంప్ హౌస్ తో 3 మిషన్ 1110 గంటలపాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటలపాటు పనిచేసింది. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. కాళేశ్వరంలోని తొలిపంప్ హౌస్ ఇదేకావడం విశేషం.
లక్ష్మీ పంప్ హౌస్ ను పార్వతి పంప్ హౌస్ కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజులపాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులోని మొదటి మిషన్ 1347గంటలపాటు పని చేసింది. 12వ మిషన్ అతి తక్కువగా 195 గంటలపాటు పనిచేసింది. ఇక లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం ఏకంగా 504 రోజులపాటు నీటిని పంప్ చేసి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. అత్యధికంగా రెండవ మిషన్ 1076 గంటల నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటలపాటు పని చేసింది.
గాయత్రి పంప్ హౌస్ ఘనత..
లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ ను 2019 ఆగష్టు 11న మేఘా సంస్థ ప్రారంభించింది. అనతికాలంలోనే వంద టిఎంసీలను ఎత్తిపోసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించారు. ఈ పంప్ హౌస్ లో రెండవ మిషన్ అత్యధికంగా 1703 గంటలపాటు నీటిని పంపింగ్ చేయగా.. మొదటి మిషన్ 1367 గంటలపాటు పనిచేసి 111మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని ఏడో మిషన్‌లో ఒక్కొక్క మిషన్ నుంచి 3150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి.
ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీస్థాయిలో పంపుహౌస్‌లను మేఘా ఈ పథకంలో నిర్మించింది. రోజుకు గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాలను మేఘా నిర్మించడం విశేషం. ఈ నిర్మాణాలన్నీ కూడా మేఘా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలుస్తున్నాయి.
జిగేల్ మనిపిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్లు..
మేఘా(ఎంఈఐఎల్) కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం-ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలోనూ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5159 మెగావాట్ల విద్యుత్. ఇంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరంకాగా అందులో ఎంఈఐఎల్ 4439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్ తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు.. వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు.. మోటార్లను బీహెచ్ఈఎల్.. ఆండ్రిజ్.. జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి.
ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఇప్పటివరకు ఒక్క మేడిగడ్డలోనే జరిగింది. లక్ష్మీ.. సరస్వతి.. పార్వతి పంపు హౌస్ లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్-1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు మోటార్లు ఏర్పాటు చేశారు. అన్నారం సరస్వతిలో 12పంపింగ్ యూనిట్లు.. సుందిళ్ళ పార్వతి పంపంగ్ కేంద్రంలో 14 యూనిట్లు కొద్దిరోజుల్లోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి.
భారీ స్థాయిలో పంపింగ్.. విద్యుత్ ఉత్పత్తి..
ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో ఏడు రోజులకి రెండు టీఎంసీలు పంపు చేసేలా ఏడు యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. దీనిలోని ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వియోగించేలా పంపింగ్ సామర్ధ్యం ఉందంటే ఇది ఎంతపెద్దదో అర్థం చేసుకోవచ్చు.
దీని తర్వాత రంగనాయక సాగర్‌లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135మెగావాట్ల సామర్ధ్యంతో మేఘా(ఎంఇఐఎల్) ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అటూ నీటి పంపింగ్ విషయంలోనూ.. విద్యుత్ సబ్ స్టేషన్-ట్రాన్స్ మిషన్ల ఏర్పాటు విషయంలోనూ సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పుతోంది. నీటి రంగ ప్రాజెక్టుల్లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పుతున్న ‘కాళేశ్వరం’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.