బాబుకు భేషైన సలహా ఇచ్చిన వైసీపీ మంత్రి?

చంద్రబాబు రాజకీయ గండర గండడు, అపర చాణక్యుడు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఎదురులేని నేత. ఇలాంటి బిరుదులు చాలానే ఎల్లో మీడియా ఇచ్చి టీడీపీని ఇంతటి స్థాయికి తీసుకువచ్చిందని అంటారు.  Advertisement ఇదిలా ఉంటే…

చంద్రబాబు రాజకీయ గండర గండడు, అపర చాణక్యుడు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఎదురులేని నేత. ఇలాంటి బిరుదులు చాలానే ఎల్లో మీడియా ఇచ్చి టీడీపీని ఇంతటి స్థాయికి తీసుకువచ్చిందని అంటారు. 

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో కంటే కూడా స్థానిక ఎన్నికల్లో మరింతగా టీడీపీ దిగజారిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో తాజాగా వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు చూసిన వారు, కరడు కట్టిన టీడీపీ ఫ్యాన్స్ సైతం తెగ  కలవరపడుతున్నారు. 

ఈ నేపధ్యంలో చంద్రబాబుకు వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు ఒక సలహా ఇచ్చారు. చంద్రబాబు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని కూడా ఆయన గుర్తు చేశారు. అందువల్ల బాబు ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే  హుందాగా ఉంటుందని అప్పలరాజు అంటున్నారు.

బాబు ఊరూ వాడా తిరిగి ప్రచారం చేస్తే  టీడీపీ ఓడిందని, జగన్ కాలు బయటపెట్టకుండా వైసీపీని గెలిపించుకున్నారంటూ ఒక గొప్ప  పోలిక కూడా చూపించారు. 

ఇక వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాధ్ అయితే చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఓటమి కంటే ఈటెల్లాంటి మాటలు ఈ సలహాలు బాబుని ఇంకా బాధ పెడతాయేమో చూడాలి.

పొలిటికల్ హీరో జగన్

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు