ఉక్కు కంటే ముందు తుక్కు రేపుతున్నారు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఉద్యోగా సంఘాలు ఆందోళన చేపట్టాయి. తొలినాళ్లలో రాజకీయ పార్టీల నిరాహార దీక్షల, పాదయాత్రలతో ఈ హడావిడి కాస్త బాగానే సాగింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలతో అందరూ…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఉద్యోగా సంఘాలు ఆందోళన చేపట్టాయి. తొలినాళ్లలో రాజకీయ పార్టీల నిరాహార దీక్షల, పాదయాత్రలతో ఈ హడావిడి కాస్త బాగానే సాగింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలతో అందరూ ఇటువైపు వచ్చారు. అయితే ఇప్పటి వరకూ నాయకుడులేని ఉద్యమంగా విశాఖ ఉక్కు వ్యవహారం నత్తనడక నడుస్తోంది. 

సమ్మె నోటీసిచ్చినా, రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కూడగట్టడంలో ఎందుకో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే అదే సమయంలో బ్యాంక్ ఉద్యోగులు మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మె పేరుతో విధులు బహిష్కరించిన ఉద్యోగులు, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం బుజ్జగించినా వినేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ దశలో కేంద్రం దిగిరాక తప్పేలా లేదని అంటున్నారు విశ్లేషకులు.

దేశవ్యాప్తంగా 9 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నట్టు చెబుతున్నారు నాయకులు. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, లోన్లు, చెక్కుల లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఏపీలో 25వేల మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. రెండు రోజుల సమ్మె సామాన్య ప్రజలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ సమ్మెను ఇలాగే కొనసాగించే సంచలన నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రజలకు, ప్రభుత్వాలకు కష్టాలు తప్పవు.

అంతకష్టం ఏమొచ్చింది..?

వ్యాపారం మా పని కాదు, దానికి వేరేవారున్నారు, వారి దయ మా మీదుంటే చాలు. ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్న మాటలివి. ప్రైవేటీకరణకు వెనకాడే పరిస్థితే లేదని తెగేసి చెబుతున్న మోదీ.. బ్యాంకింగ్ రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొండి బకాయిలతో నడిచే ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలను, ప్రజల పన్నులతో పూడ్చలేమనేది వారి వాదన.

అయితే ఇలా ప్రైవేటీకరించుకుంటూ పోతే.. రేపు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ప్రజల జుట్టు పెట్టినట్టేనంటున్నారు ఉద్యోగలు. తమ ఉద్యోగ భద్రత కూడా కరువైపోతుందనేది వారి ఆవేదన. విలీనాలు, ప్రైవేటీకరణ అంటూ కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శిస్తున్నారు. సమ్మెలో పాల్గొంటున్న తమతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సైతం సుముఖంగా లేదని, ఇదే కొనసాగితే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

ఓవైపు ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది, మరోవైపు దేశవ్యాప్తంగా బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో పెద్ద ఉద్యమం మొదలైంది. ఉక్కు విషయంలో పదేపదే ప్రైవేటీకరణను సమర్థించుకుంటూ ఆర్థిక మంత్రి ప్రకటనలు విడుదల చేస్తున్నారు. 

అదే ధైర్యం బ్యాంకుల విషయంలో కూడా చూపించగలరా..? ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుండా ఉండగలదా? బ్యాంకు ఉద్యోగులకు తలొగ్గితే.. ఉక్కు ఉద్యమానికి కూడా కేంద్రం తలవంచాల్సిందే. అదే జరిగితే ప్రజా ఉద్యమాలకు కేంద్రం వెనక్కు తగ్గినట్టే లెక్క. 

పొలిటికల్ హీరో జగన్

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు