ఏపీలో ఆ రెండు పట్టణాల్లో పూర్తి లాక్ డౌన్

ఇప్పటికే చెన్నైలో మరోసారి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈసారి మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారక్కడ. ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 పట్టణాలు లాక్ డౌన్ దిశగా వెళ్తున్నాయి.…

ఇప్పటికే చెన్నైలో మరోసారి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈసారి మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారక్కడ. ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 పట్టణాలు లాక్ డౌన్ దిశగా వెళ్తున్నాయి. అవును.. రేపట్నుంచి అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారు.

ప్రకాశం జిల్లాలో గడిచిన వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒంగోలులో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు పట్టణంలో 69 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒంగోలు సిటీలోనే 14 కంటైన్మైంట్ జోన్లు ఉన్నాయి. ప్రతి 2 రోజులకు ఓ కొత్త కంటైన్మెంట్ ఏరియా పుట్టుకొస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రేపట్నుంచి 2 వారాల పాటు ఒంగోలులో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.

ఇప్పటివరకు ప్రజలు చూసిన లాక్ డౌన్ లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. అవే రూల్స్ ఈ కొత్త లాక్ డౌన్ లో కూడా వర్తిస్తాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కిరాణా షాపులు తెరుస్తారు. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకురావాలి. 10 నుంచి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఉంటుంది. హాస్పిటల్ పనుల మీద తప్ప ఎవ్వరూ బయటకు రావడానికి వీల్లేదు. ఈరోజు రాత్రి నుంచే ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు ఒంగోలు చుట్టుపక్కల చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. రేపు ఉదయం సిటీలోకి వచ్చే వాహనాల్ని పొలిమేరలోనే ఆపి ప్రయాణికుల్ని దించేస్తారు.

అటు అనంతపురంలో కూడా రేపట్నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాబోతోంది. పట్టణంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేస్తారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తిరిగి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉంది. జిల్లాలో 600కు పైగా కేసులు నమోదైతే.. ఒక్క అనంతపురంలోనే 408 కేసులున్నాయి. దీంతో అనంతపురంలో లాక్ డౌన్ విధించారు. మాంసం దుకాణాలకు ఉదయం వేళల్లో కూడా అనుమతి ఇవ్వకుండా పూర్తిగా నిషేధించారు. 

చైనాకి బుద్ధి చెబుదాం

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా