అదేంటో కానీ విజయనగరం పూసపాటి రాజావారి మాన్సాస్ ట్రస్ట్ కధకు ఎండ్ కార్డ్ పడడంలేదు వారసత్వం పోరు ఇద్దరి మధ్యనే అనుకుంటే అది కాస్తా ఇపుడు మూడు ముక్కలాట అవుతోంది.
నిన్నటిదాక ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె హోదాలో సంచయిత ఈ పీఠం కోసం పోరు చేశారు. వైసీపీ సర్కార్ చలువతో ఆమె ఏడాది పాటు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు.
అయితే కోర్టు తీర్పు అశోక్ కి అనుకూలంగా రావడంతో ఆమె మాజీ అయిపోయారు. ఇక ఇపుడు ఆనందగజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిలా గజపతిరాజు తనకు వారసత్వం ప్రకారం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ పదవి దక్కుతుంది అంటూ కోర్టులో కేసు వేశారు.
తాను వారసత్వపు హక్కు ప్రకారం అన్ని విధాలుగా అర్హురాలినే అంటూ ఆమె వాదిస్తున్నారు. దీంతో అశోక్ కు ఇపుడు మరో కూతురు నుంచి న్యాయ పోరు ఎదురైందనుకోవాలి.
మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు అనే అంటున్నారు.