బాల‌కృష్ణ కూడా రైతుల‌ను వాడేస్తున్నార‌ట!

ఈ మ‌ధ్య పెద్ద సినిమాల వాళ్ల‌కు ఇదో మార్కెటింగ్ స్ట్రాట‌జీగా మారింది. సినిమా అంతా ఎలా సాగినా.. క్లైమాక్స్ లో రైతుల గురించి హీరో లెక్చ‌రిచ్చేస్తాడు.  వాళ్ల‌ను ఉద్ధ‌రించాలంటూ ఒక ప్ర‌సంగం చేస్తాడు. వ్య‌వ‌సాయం…

ఈ మ‌ధ్య పెద్ద సినిమాల వాళ్ల‌కు ఇదో మార్కెటింగ్ స్ట్రాట‌జీగా మారింది. సినిమా అంతా ఎలా సాగినా.. క్లైమాక్స్ లో రైతుల గురించి హీరో లెక్చ‌రిచ్చేస్తాడు.  వాళ్ల‌ను ఉద్ధ‌రించాలంటూ ఒక ప్ర‌సంగం చేస్తాడు. వ్య‌వ‌సాయం గొప్ప‌ద‌నాన్ని చెబుతాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇలా సినిమా క్లైమాక్స్ లో రైతుల గురించి మాట్లాడ‌టం ఒక మార్కెటింగ్ స్ట్రాట‌జీగా మారింది.

తెలుగులో ప్ర‌ముఖ హీరోలు ఇలా క్లైమాక్స్ లో రైతుల గురించి లెక్చ‌ర్లు దంచుతున్నారు. ఈ ప‌రంప‌ర‌లో బాల‌కృష్ణ కూడా అలాంటి క్లైమాక్స్ లెక్చ‌ర్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ హీరోగా రూపొందిన 'రూల‌ర్' లో కూడా రైతుల‌ను ఇలాగే ఉద్ధ‌రిస్తార‌ట‌!

'చాన్నాళ్లుగా రైతుల గురించి ఒక సినిమా చేయాల‌నుకున్నా..ఇప్ప‌టికి అది కుదిరింది.. అంటూ బాల‌కృష్ణ ప్ర‌క‌టించుకున్నారు.  ఇందులో కూడా క్లైమాక్స్ లో రైతుల‌ను ఉద్ధ‌రించే ప్రోగ్రామ్ ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఈ సినిమా టైటిల్ కు రైతుల‌కూ ఎలాంటి సంబంధం లేదు, హీరో పాత్ర రైతు గెట‌ప్  లో కూడా క‌నిపించ‌డం లేదు. ఆ పై ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో కూడా వ్య‌వ‌సాయం ఊసేమీ లేదు. కానీ ఈ సినిమాను రైతుల గురించి తీసిన‌ట్టుగా బాల‌కృష్ణ ప్ర‌క‌టించుకున్నారు. తెలుగు సినిమా హీరోల‌కు క్లైమాక్స్ లో రైతుల గురించి మాట్లాడ‌టం క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ పాయిట్ అవుతోంది,  ఆపై బాల‌కృష్ణ ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబ‌ట్టి.. రైతుల గురించి ఊక‌దంపుడు ఉండ‌వ‌చ్చు. 

ఇలాంటి లెక్చ‌ర్ల‌ను ఎన్ని ఇచ్చి ఏం ప్ర‌యోజ‌నం? వ‌్య‌వ‌సాయ ధారుల‌పై ప్రేమే ఉంటే.. లాభాల్లో కొంత భాగాన్ని ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌కు ఇవ్వొచ్చుగా? అప్పుడు క‌దా.. ఎవ‌రైనా రైతుల గురించి సినిమా తీసిన‌ట్టు!