2024లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో హస్తగతం చేసుకుంటామని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పలుమార్లు ప్రకటించారు. అయితే ఏపీలో అధికారంలోకి రావడం అన్నంత ఈజీగా కాదని ఆ పార్టీ అగ్రనేత రాంమాధవ్ అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకుంటున్న సభా వేదిక మీద నుంచి రాంమాధవ్ ఈ మాటలనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తన బలాన్ని ఒకటి నుంచి రెండుకు పెంచుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఓ హెచ్చరిక పంపింది.
ఒక రకంగా బీజేపీ విజయాన్ని టీఆర్ఎస్ చేజేతులా అందించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు చూసి టీఆర్ఎస్ ఆందోళనకు గురైంది.
దీంతో ఎలాగైనా బీజేపీని కట్టడి చేయాలనే తలంపుతో పోలీసులతో రకరకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేసింది. అయితే అణచివేత నుంచే నాయకత్వం బలపడుతుందనేందుకు తెలంగాణలో బీజేపీ తాజాగా సాధించిన ఫలితమే నిదర్శనం.
ఈ నేపథ్యంలో ఏపీలో బలపడేందుకు తెలంగాణ బీజేపీ ఓ మార్గాన్ని చూపినట్టైంది. అయితే దాన్ని అందుకుని క్షేత్రస్థాయిలో బలపడేందుకు ఏపీ బీజేపీ నాయకత్వం ఎలాంటి వ్యూహ రచన చేస్తుందనేది ఇప్పుడు సవాల్‌గా మారింది. రాజకీయాల్లో మాటల కంటే చేతలే ప్రజానీకానికి నమ్మకం కలిగిస్తాయి.
ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకత్వానికి తమపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగిం చడం పెద్ద టాస్క్. అందుకే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఏపీ బీజేపీ నేతలపై ఒత్తిడి పెంచుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.