ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 3200కు చేరింది. వీళ్లలో 2209 మంది డిశ్చార్జ్ కాగా.. 64 మంది మరణించారు. ప్రస్తుతం 927 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందుతోంది.
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల మధ్య రికార్డ్ స్థాయిలో 12,613 శాంపిల్స్ ను అధికారులు పరీక్షించారు. వీటిలో 82 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్థారించారు. ఇక గడిచిన 24 గంటల్లో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,82,757 శాంపిల్స్ ను పరీక్షించారు.
ఇక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి విషయానికొస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వాళ్లలో 479 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 112 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్థారించారు. వీటితో కూడా కలిపి చూసుకుంటే.. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3791కు చేరింది.
జిల్లాల వారీగా చూసుకుంటే.. కర్నూలు (724), గుంటూరు (496), కృష్ణా (477) లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు విజయనగరంలో కేసుల సంఖ్య 26కు, శ్రీకాకుళంలో కేసుల సంఖ్య 23కు పెరిగింది. విశాఖలో పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 383 హాట్ హాట్ స్పాట్స్ ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.