కన్నీటితో తమ్మినేని సెంటిమెంట్..!

స్పీకర్ అన్న మాట తమ్మినేని సీతారామ్ కి చక్కగా వర్తిస్తుంది. ఆయన మంచి వక్త. ఏ విషయాన్ని అయినా అనర్ఘళంగా మాట్లాడగలరు. ఆయన పూర్వాశ్రమం  టీడీపీలో ఉన్నపుడు అధికార ప్రతినిధిగా విపక్షాన్ని అల్లాడించేవారు. ఇపుడు…

స్పీకర్ అన్న మాట తమ్మినేని సీతారామ్ కి చక్కగా వర్తిస్తుంది. ఆయన మంచి వక్త. ఏ విషయాన్ని అయినా అనర్ఘళంగా మాట్లాడగలరు. ఆయన పూర్వాశ్రమం  టీడీపీలో ఉన్నపుడు అధికార ప్రతినిధిగా విపక్షాన్ని అల్లాడించేవారు. ఇపుడు ఆయన మాటల దరువుకు మాజీ బాస్ చంద్రబాబు కూడా  హడలెత్తిపోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా దారుణంగా ఉన్నాయి. వెనకబాటుతనం అంటే ఈ జిల్లాల‌ను చూస్తే అర్ధమవుతుంది. అటువంటి జిల్లాల విషయంలో చంద్రబాబు వివక్ష చూపుతున్నారంటూ తమ్మినేని కళ్ళనీళ్ళపర్యంతం అవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా. ఇక్కడ కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. గత పాలకుల నిర్లక్షయం మూలంగా ఇదంతా జరిగింది. ఇపుడు దమ్మున్న నాయకుడిగా జగన్ ముందుకు వచ్చి విశాఖను రాజధాని చేస్తామంటే బాబు మోకాలడ్డడం ధర్మ‌మేనా అంటూ తమ్మినేని జనం ముందే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

విశాఖ పాలనా రాజధాని అయితే బాబుకు ఎందుకు కడుపు మంట అంటూఅడిగి  కడిగేస్తున్నారు స్పీకర్. బాబుకు ఆ దమ్ము లేదు, జగన్ కి ఉంది. అందుకే ఆయన వెనకబడిన ప్రాంతాలకు అభివ్రుధ్ధిని తేవాలనుకుంటున్నారని స్పీకర్ గట్టిగా వాదిస్తున్నారు.

విశాఖ రాజధాని అయితే శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ వస్తుందని కూడా గట్టిగా చెబుతున్న తమ్మినేని బాబు కాదు కదా ఏ బాబు అడ్డుకున్నా విశాఖని రాజధాని కాకుండా చేయలేరని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

అమరావతిలో పారుతున్న కన్నీరు  పేద రైతుల భూములను చౌకగా కొని కోట్లకు పడగెత్తుదామనుకున్న అత్యాశాపరులదని కూడా తమ్మినేని కౌంటర్లు వేస్తున్నారు. శ్రీకాకుళంలో కారుతున్న కన్నీరు మాత్రం కొన్ని దశాబ్దాలుగా బాగుపడని దీనులది, పేదలది అంటూ రెండింటికీ తేడా చక్కగానే  చెబుతున్నారు.

మొత్తానికి సెంటిమెంట్ తో అమరావతిని కరింగిచేసి అయినా విశాఖ రాజధానిని కోరుకుంటున్న తమ్మినేని జగన్ మాట ఫైనల్, విశాఖే మన రాజధాని అంటూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. రాజధాని విషయంలో స్పీకర్ తమ్మినేని బాగా ఎమోషనల్ అవుతూండడంతో తమ్ముళ్ళకు నోట మాట రావడంలేదుగా.

మీ పిల్లల చదువులకు నాది భరోసా :సీఎం