విశాఖ రాజధాని అయిపోయినట్లే. దీని మీద ముఖ్యమంత్రి జగన్ గత నెలలో అసెంబ్లీలో ఒక మాట అన్నారు. ఇపుడు అదే శాసనం అయింది. మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇక మిగిలినవన్నీ లాంచనమే.
అయితే విశాఖకు ఎపుడు పాలన వెళ్తుంది అన్నది మరొవైపు చర్చగా ఉంది. దీని మీద అనేక కధనాలు ఉన్నా విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్త తెలుగు సంవత్సరాది అంటే ఉగాది తరువాత మంచి ముహూర్తం చూసి విశాఖలో పాలన ప్రారంభిస్తారని అంటున్నారు.
ఇక ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉందని అంటున్నారు. ఆ రోజున చైత్ర శుద్ధ ఏకాదశి కావడంతో లాంచనంగా విశాఖలో పాలనకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారని అంటున్నారు.
ఇక మూడు రాజధానుల కధ నెల రోజుల ముందే లోకానికి తెలిసినా దాని మీద సచివాలయం ఉద్యోగులకు, ప్రభుత్వ పెద్దలకు చాలా కాలం క్రితమే తెలుసు అంటున్నారు. విషయం పొక్కిన వెంటనే చాలామంది ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగులు విశాఖలో అద్దె ఇళ్ళకు, వీలైతే సొంత ఇళ్ళకు కూడా వెతుకులాట ప్రారంభించారని అంటున్నారు.
దాంతో విశాఖ శివారులో ఉన్న మధురవాడ ప్రాతం దశ ఒక్కసారిగా తిరిగింది. ఇక్కడ ఇపుడు అద్దె కోసం అపార్ట్మెంట్లకు యమ డిమాండ్ వచ్చింది. కాపులుప్పాడ వద్ద ఉన్న మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. దాంతో దానికి దగ్గరగా నగరానికి చేరువగా ఉందేందుకు మధురవడ బెస్ట్ ప్లేస్ గా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు.
మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అమరావతిలో పెట్టుకుని ఏప్రిల్ నాటిని విశాఖకు పూర్తిగా షిఫ్ట్ అయ్యేలా ప్రభుత్వ వర్గాలు పక్కా ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది.