అంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఉందా?

ఒక ఫేక్ పోస్ట్ మంగళవారం నాడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.  అవునా అంత పని జరిగిందా అంటూ ఆ పోస్టు చూసిన వారు ఆశ్చర్యపోయారు.  ఇంత కలిపి అది ఫేక్ పోస్ట్ అని…

ఒక ఫేక్ పోస్ట్ మంగళవారం నాడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.  అవునా అంత పని జరిగిందా అంటూ ఆ పోస్టు చూసిన వారు ఆశ్చర్యపోయారు.  ఇంత కలిపి అది ఫేక్ పోస్ట్ అని తేలింది. ముమ్మూర్తులా ఒరిజినల్ పోస్ట్ ను పోలి ఉండటంతో…  తొలుత అది పోస్ట్ కాగానే, నిజమే అని అందరూ భావించారు! పవన్ కళ్యాణ్ అంతపని చేశాడా అంటూ ఆశ్చర్య పోయారు.  అది ఫేక్ అని తేలిన తర్వాత ‘మరి అదే కదా… అంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు రావాలి’ అంటూ సరదాగా జోకులు వేసుకున్నారు.

ఇంతకూ ఆ ఫేక్ పోస్ట్ ఏమిటా అని  ఆలోచిస్తున్నారు కదా… జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేది ఆ పోస్ట్. మూడు రాజధానుల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడినందుకు,  దానిని వ్యతిరేకించాలనే జనసేన పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించినందువలన… జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సస్పెండ్ చేస్తున్నారంటూ మంగళవారం ఉదయం జనసేన అధికారిక ప్రకటన అంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల అయింది. పవన్ కళ్యాణ్ సంతకంతోనే దానిని విడుదల చేశారు. 

వరప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు పార్టీ నిర్ణయం కాదని, పార్టీ అభిప్రాయం కాదని పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ప్రకటించారు.  మంగళవారం ఉదయం సస్పెన్షన్ ప్రకటన వచ్చింది. కాసేపటికే అది ఫేక్ అని తేలింది.

అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే…  వరప్రసాద్ సస్పెండ్ చేసే ధైర్యం పార్టీకి లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఒకవేళ పార్టీ విప్ జారీ చేసి ఉంటే గనుక… దానిని ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలని అడిగే అవకాశం వచ్చేది.  పార్టీకి ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే కావడం వల్ల ఆ అవకాశం లేనట్లే. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వరప్రసాద్ కు ఏ మాత్రం నష్టం లేదు.

ఆయన ఎమ్మెల్యే పదవి పోదు. పార్టీ గుర్తింపుతో కాకుండా, స్వతంత్ర సభ్యుడిగా ఆయనను స్పీకరు గుర్తించే అవకాశం ఉంది. దానివలన పార్టీకి నష్టం తప్ప ఆయనకు కాదు.  ఈ నేపథ్యంలోనే, పార్టీని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కీర్తించినప్పటికీ… వరప్రసాద్ మీద చర్య తీసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదు అని పలువురు భావిస్తున్నారు.  ఆచరణలో కూడా పవన్ వైఖరి అలాగే కనిపిస్తోంది.

కొడాలి నాని అన్న నాకోసం ప్రాణం ఇస్తాడు