షాకింగ్: వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇదే

ఇప్పుడంటే ఎక్కడపడితే అక్కడ రోడ్ పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చూస్తున్నాం. మరి చరిత్రలో కూడా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయా? దీనికి ఆనవాళ్లతో సహా రుజువులు చూపిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. క్రీస్తుశకం…

ఇప్పుడంటే ఎక్కడపడితే అక్కడ రోడ్ పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చూస్తున్నాం. మరి చరిత్రలో కూడా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయా? దీనికి ఆనవాళ్లతో సహా రుజువులు చూపిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. క్రీస్తుశకం 79వ సంవత్సరంలోనే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఉందని వాళ్లు వెల్లడిస్తున్నారు. అంటే 1900 ఏళ్ల క్రితమే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఉందన్నమాట.

ఇటలీకి దక్షిణాన ఉన్న పురాతన పాంఫే (Pompeii) నగరంలో ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రీ.శ 79వ సంవత్సరంలో వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలవ్వడంతో ఈ నగరం పూర్తిగా కనుమరుగైంది. అలా తుడిచిపెట్టుకుపోయిన ఈ నగరాన్ని గతేడాది గుర్తించారు పరిశోధకులు.

తాజాగా ఈ నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నట్టు గుర్తించారు. రోడ్డు పక్కనే రకరకాల కుండలతో స్టాల్స్, అందులో ఉండే వంటకాలను తెలిపేలా బొమ్మలు ఉండే స్టాల్ ను గుర్తించారు. అప్పట్లోనే బాతు, కోడి, మేక, చేపలతో ఎన్నో రకాల వంటకాల్ని సిద్ధంచేశారని కనిబెట్టారు. 

ప్రతి కుండపై జంతువు బొమ్మ దానికి సంబంధించి ఆహారాన్ని ఏర్పాటుచేశారు. ఆహారానికి సంబంధించిన అవశేషాల్ని కూడా కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఈ ఆహారంతో రెడ్ వైన్ లేదా వేడి నీళ్లను అందించేవారనే  విషయాన్ని కూడా తెలుసుకున్నారు.

పాంఫే నగరంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కట్టడాలు, నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పుడీ తాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో రోమన్ల కాలంలో వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన జీవన విధానం ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన త్రవ్వకాలతో పాంఫే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా