తన కడుపున పుట్టకపోయినా తన సొంత అన్న ఆనందగజపతిరాజు కూతురు ఆమె. పైగా తమ పూసపాటి వంశీకురాలే. ఆమెకు కూడా తనలాగే అన్ని వారసత్వ హక్కులూ ఉన్నాయన్న సంగతిని నలభ య్యేళ్ళ ప్రజాస్వామిక జీవితంలో ఎన్నొపదవులు అధిరోహించి అనుభవించిన రాజు గారు మరచిపోయారు.
సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ అయ్యే అర్హత ఆమెకు లేదని అంటూ అక్కసు వెళ్లగక్కారు. దానికి మతాన్ని కూడా పులిమారు. ఆమె క్రిస్టియన్ మతస్తురాలు అంటూ ఆరోపించారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైసీపీ సర్కార్ వేలు పెట్టడమేంటని కూడా గద్దించారు.
దీనికి సంచయిత గజపతిరాజు దీటుగానే స్పందించారు. తన సొంత బాబాయి ఇలా మాట్లాడడం దారుణం అన్నారు. తాను వాటికన్ సిటీకి వెళ్తే క్రిస్టియన్ అయిపోయానా అంటూ నిలదీశారు.
అశోక్ తన జీవితంలో చర్చిలు, మసీదులకు వెళ్ళలేదా, ఆయన కూడా మతం పుచ్చుకున్నారా అని గట్టిగానే ప్రశ్నించారు. తాను పక్కా హిందువుని అని ఆమె చెప్పుకున్నారు.
తన పనితీరు చూసి బాబాయ్ విమర్శిస్తే బాగుండేది, కానీ తనకు అర్హత లేదని అనడం బాధాకరమని ఆమె ఆవేదన చెందారు. తన తాత పీవీజీ రాజు మహిళలను ప్రోత్సహించి వారికి మహిళా కళాశాల కట్టిస్తే బాబాయ్ మహిళలకు పదవులు అక్కరలేదని మాట్లాడుతున్నారని, మహిళా దినోత్సవం వేళ మంచి బహుమతే ఇచ్చారని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు.
మొత్తానికి రాజు గారు ఇంత అనుభవం ఉంది పిచిక మీద బ్రహ్మాస్త్రంలా సొంత కూతురు మీద ఈ కామెంట్స్ ఏంటి అన్న విమర్శలు వస్తున్నాయి.