మూడు రాజధానులు ఏపీ ప్రజలు కోరలేదని వారు అంటున్నారు. విశాఖ రాజధాని పట్ల జనంలో మిశ్రమ స్పందన లభిస్తోందని కూడా అంటున్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు కూడా ఉండడంతో సెగ ఇపుడు గట్టిగా అశోక్ కే తగులుతోంది.
అనేక మార్లు రాష్ట్ర మంత్రిగా, ఒకమారు కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్రాకు ఏమీ చేయకపోగా ఇపుడు తమ్ముళ్ళను దగ్గర కూర్చోబెట్టి సమావేశాలు పెట్టించి మరీ విశాఖ రాజధానిపైన విషం కక్కుతున్నారని విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ వంటి వారు గట్టిగా తగులుకుంటున్నారు.
కోటలో కూర్ఛుని కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా హెచ్చరిస్తున్నారు. అశోక్ తాను మంత్రిగా పదవులు అనుభవించారు తప్ప జనానికి చేసింది శూన్యమని కూడా ఆయన అంటున్నారు.
విశాఖ రాజధానిగా వస్తే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, మెట్రో రైల్ ప్రాజెక్ట్ తో మొత్తం ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధిపధంలో నడుస్తుందని వారు అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ తమ్ముళ్ళు సొంత ప్రాంతం పట్ల మమకారం కూడా బాబు అడుగులకు మడుగులు ఒత్తడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో ఏమీ చేయలేకపోయిన అశోక్ గజపతి ఇపుడు ఇలా రాజధానిని కూడా రాకుండా చేయడమేంటని మండిపడుతున్నారు. మొత్తానికి అశోక్ గజపతి అశీస్సులతోనే విజయనగరం జిల్లా తమ్ముళ్ళ మీటింగ్ జరిగిందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
పెద్దాయన మీద గుస్సా అవుతున్నారు. రాజు గారు ఓడిన దగ్గర నుంచి హైదరాబాద్ లో ఉంటున్నా కీలకమైన రాజధాని విషయంలో రాంగ్ స్టెప్ వేశారని కస్సుమంటున్నారు. చూడాలి మరి అశోక్ ఈ సెగ నుంచి ఎలా బయటపడతారో.