హనుమంతునిపాడు మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన చింతలచెరువు లక్ష్మీ నారాయణరెడ్డి, ధర్మపత్ని, విజయలక్ష్మి గార్ల కుమారుడు, చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి అయినా ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం .
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆస్ట్రేలియా దేశానికి (ఏపీఎన్ఆర్టీ) కోఆర్డినేటర్ గా నియమితులయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియచేస్తూ జగన్ గారి ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ప్రభుత్వం తరపున అవసరమైనా సహాయ సహకారాలు అందిస్తానని వారు తెలియచేసారు.
ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.