మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారా. ఆయన చేసిన కామెంట్స్ ఆ విధంగానే ఉన్నాయా అంటే అవును అనే సమాధానం వైసీపీ వర్గాల్లోనుంచి వస్తోంది.
కాలం చెల్లిన రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కరోనా రోగులకు ఇస్తున్నారని అయ్యన్న తాజాగా ఆరోపించారు. దాని వల్ల ముగ్గురు చనిపోయారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దీనికి ధీటైన జవాబే వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఇచ్చారు.
రెమ్ డెసివర్ ఇంజక్షన్లకు కాలం చెల్లలేదని, అయ్యన్నే తప్పుడు సమాచారంలో జనాలలో భయాందోళలను రేకెత్తిస్తున్నారు అంటూ గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. రెమ్ డెసివర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న కంపెనిల్లో ఒకటి అయిన మైలాన్ లాబరేటీస్ లిమిటెడ్ సైతం ఈ ఇంజక్షన్లను మరో ఏడాది దాకా ఉపయోగించుకోవచ్చు అని చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
ఇక ఇతర కారణాల వల్ల ఒకరిద్దరు మరణిస్తే వాటిని రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వల్లనే అంటూ అయ్యన్న చెబుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కరోనా వంటి విపత్తు వేళ ప్రజలకు అండంగా ఉండాల్సింది పోయి తప్పుడు ఆరోపణలు చేస్తూ జనాలలో భయాందోళలను రేకెత్తిస్తున్న అయ్యన మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మొత్తానికి ప్రతీ రోజూ ఠంచనుగా వీడియో క్లిప్స్ మీడియాకు విడుదల చేస్తూ సర్కార్ మీద దండెత్తున్న అయ్యన్న మీద సీరియస్ యాక్షన్ ఉంటుందా.